నాని కామెంట్స్ కి షాక్ అయిన వెంకటేష్!

7:10 am, Tue, 16 April 19
nani comments on venkatesh

హైదరాబాద్: నిన్న జరిగిన ‘జెర్సీ’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు వెంకటేష్ ముఖ్య అతిధిగా వచ్చాడు. అయితే ఈ సందర్భంగా నాని వెంకటేష్ గురించి మాట్లాడుతూ చేసిన కామెంట్స్ ఆ కార్యక్రమానికి వచ్చిన అతిధులను మాత్రమే కాకుండా వెంకటేష్ కు కూడ షాక్ ఇచ్చాయి.

వెంకీ ఆవకాయలాంటి వారు అంటూ నాని వెంకటేష్ ను ఇష్టపడని తెలుగు ప్రేక్షకులు ఉండరు అంటూ కామెంట్స్ చేసాడు. తనకు రియల్ లైఫ్ లో బాగా నచ్చే వ్యక్తి వెంకటేష్ అని చెపుతూ తన సినిమా ఫంక్షన్ కు వెంకీని అతిధిగా పిలవాలి అన్న కోరిక ‘జెర్సీ’ తో తీరింది అంటూ కామెంట్స్ చేయడమే కాకుండా అన్నీ కుదిరితే తనకు వెంకటేష్ తో కలిసి నటించాలి అన్న కోరిక ఉంది అని చెపుతూ తాను తాను వెంకీతో కలిసి ఒక మల్టీ స్టారర్ చేయడానికి రెడీ అన్న సంకేతాలు ఇచ్చాడు.

ఈవారం విడుదల కాబోతున్న ‘జెర్సీ’ మూవీ గురించి మాట్లాడుతూ నాని ఈమూవీకి సూపర్ హిట్ బ్లాక్ బస్టర్ హిట్ అన్న పదాలు సరిపోవనీ ఇలాంటి మంచి సినిమా పక్కన మరో కొత్త పదం క్రియేట్ చేయాలి అంటూ ఈమూవీ పై తనకు ఉన్న అంచనాలను మరింత భారీ స్థాయిలో పెంచేసాడు. అంతేకాదు ఈసినిమా గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది అంటూ ఈమూవీని తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఒక ట్రెండ్ ను క్రియేట్ చేస్తుంది అన్న తన నమ్మకాన్ని మరొకసారి వివరించాడు నాని.

ఇంతవరకు తెలుగులో ఏ హీరో చేయని ప్రయోగం తాను చేస్తున్నాను అంటూ ఈమూవీని జడ్జ్ చేయగల సమర్ధత ఒక్క తెలుగు ప్రేక్షకులకు మాత్రమే ఉంది అంటూ ప్రేక్షకుల అభిరుచి పై ప్రశంసలు కురిపించాడు. ఎంతో ఉత్సాహంగా జరిగిన ఈమూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఉద్యేగం తో మాట్లాడిన నాని మాటల తీరును చూసిన వారు నాని ‘జెర్సీ’ పై పెంచుతున్న విపరీత మైన అంచనాలు సాధారణ ప్రేక్షకుదుని అందుకోలేకపోతే ఈ మూవీ పరిస్థితి ఏమిటి అంటూ కామెంట్స్ చేసుకున్నట్లు టాక్..