గుంటూరు: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో జగన్ సారథ్యంలోని వైసీపీ గెలవబోతుందనే ప్రచారం ఎక్కువగా ఉన్న నేపథ్యంలో చాలామంది టీడీపీ నేతలు వైసీపీలోకి టచ్‌లో ఉన్నారని తెలుస్తోంది. వీరు ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే వైసీపీలోకి వెళ్లిపోతారని ప్రచారం జరుగుతుంది.
ఈ క్రమంలోనే టీడీపీ సీనియర్ నేత, ఎంపీ రాయపాటి సాంబశివరావు సోదరుడు రాయపాటి శ్రీనివాస్ టీడీపీని వీడనున్నారని తెలుస్తోంది. తాజాగా ఆయనే చేసిన వ్యాఖ్యలే పార్టీ మారడానికి ఊతమిస్తున్నాయి. రుడు శ్రీనివాస్ చేసిన వ్యాఖ్యలు ఇందుకు ఊతమిస్తున్నాయి.
చదవండి: తూర్పు ఎవరిది? టీడీపీ కంచుకోటని కైవసం చేసుకుంటుందా!
ఎమ్మెల్సీ సీటు రాలేదనేనా…
ఇటీవల టీడీపీ తరపున ఎమ్మెల్సీ సీటు ఆశించి భంగపడ్డ శ్రీనివాస్… ప్రత్యేక హోదా విషయంలో తాజాగా టీడీపీని టార్గెట్ చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా రాకపోవడంలో ప్రధాన ముద్దాయిలుగా బీజేపీ, టీడీపీలు ఉంటాయని…ఆ తర్వాత కాంగ్రెస్, జనసేనలు ఉంటాయని సంచలన వ్యాఖ్యలు చేశారు.
అన్నీ పార్టీలని టార్గెట్ చేసిన రాయపాటి శ్రీనివాస్… వైసీపీని మాత్రం విమర్శించలేదు. దీంతో త్వరలోనే ఆయన వైసీపీలోకి వెళతారని ప్రచారం జరుగుతుంది. అయితే తన కుమారుడు రాయపాటి మోహన్ సాయికృష్ణ రాజకీయ భవిష్యత్తు కోసమే రాయపాటి శ్రీనివాస్ వైసీపీ వైపు చూస్తున్నారని తెలుస్తోంది. మరి చూడాలి ఎన్నికల తర్వాత ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో?








