34.3 C
Hyderabad
Sunday, October 11, 2026
- Advertisement -
Home వార్తలు ఆంధ్రప్రదేశ్ ఆ నేర్పు మీకుందేమో కానీ.. తిండి లేక అల్లాడుతున్న పేదలకు లేదు: జగన్‌పై అచ్చెన్నాయుడు ఫైర్

ఆ నేర్పు మీకుందేమో కానీ.. తిండి లేక అల్లాడుతున్న పేదలకు లేదు: జగన్‌పై అచ్చెన్నాయుడు ఫైర్

- Advertisement -

అమరావతి: టీడీపీ నేత, మాజీ మంత్రి అచ్చెన్నాయుడు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై మరోమారు ఫైరయ్యారు.

వైరస్‌తో సహజీవనం చేయగల నేర్పు వైఎస్‌ వారసుడిగా మీకుందేమో కానీ లాక్‌డౌన్‌తో తిండి లేక, పనిలేక అల్లాడుతున్న పేదలకు లేదని ట్విట్టర్‌ జగన్‌పై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.

చదవండి: ముస్లిం వ్యాపారుల నుంచి కూరగాయలు కొనవద్దంటూ బీజేపీ ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు

‘‘జ్వరమే కదా తగ్గిపోతుందని అంటున్నారు.. మరి తాడేపల్లి ఇల్లు దాటి ఎందుకు బయటకు రావడం లేదు?’’ అని ప్రశ్నించారు.

దేశంలోనే కోవిడ్‌ పరీక్షలు చేయడంలో ఏపీ నెంబర్‌ వన్‌ అని ప్రకటించారు కానీ, కరోనా వ్యాప్తిలో, మరణాల్లో, తక్కువ రికవరీలో ఏపీయే నెంబర్‌ వన్‌ అని అన్నారు.

విశాఖలో కేసులు పెరగలేదని మభ్యపెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పెండింగ్‌లో ఉన్న 1600 టెస్టుల ఫలితాలు వెల్లడిస్తే లెక్క తేలిపోతుందన్నారు.

పాజిటివ్‌ వస్తే డిశ్చార్జి చేసి..నెగెటివ్‌ వస్తే వైద్యం చేస్తున్నప్పుడే..మీ పాలన ఎంత అధ్వానంగా ఉందో అర్ధమైంద ఎద్దేవా చేశారు. 

- Advertisement -