26.4 C
Hyderabad
Sunday, September 20, 2026
- Advertisement -
Home వార్తలు ఆంధ్రప్రదేశ్ ఏపీలో పోలైన పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్క ఇదే..

ఏపీలో పోలైన పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్క ఇదే..

AP Political News, AP Election News, AP Votes Counting News, Newsxpressonline
- Advertisement -

అమరావతి: ఆంధ్రప్రదేశ్ 175 అసెంబ్లీ స్థానాలతో పాటు 25పార్లమెంట్ స్థానాలకి ఏప్రిల్ 11న ఎన్నికలు జరిగిన విషయం తెల్సిందే.  ఇక ఈ ఎన్నికల ఫలితాలు రేపు అనగా గురువారం వెలువడనున్నాయి. ఏపీ ఎన్నికల సంఘం కౌంటింగ్‌కి సంబంధించిన అన్నీ ఏర్పాట్లని పూర్తి చేసింది.

ఇక ఏపీలో  పోస్టల్ బ్యాలెట్, పోస్టల్ సర్వీస్ ఓట్ల వివరాలను ఎన్నికల సంఘం విడుదల చేసింది. ఏపీలోని 25 లోక్ సభ నియోజకవర్గాల పరిధిలో 28,662 పోస్టల్ సర్వీస్ ఓట్లు పోలయ్యాయని ఈసీ తెలిపింది. అలాగే 175 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో 29,592 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు వచ్చాయని చెప్పింది.

అయితే గురువారం ఉదయం 7 గంటల్లోగా తమకు అందే పోస్టల్ బ్యాలెట్లనే పరిగణనలోకి తీసుకుంటామని స్పష్టం చేసింది.

జిల్లాలవారీగా వచ్చిన పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ వివరాలు…

శ్రీకాకుళం జిల్లా -8,121 ఓట్లు
విజయనగరం జిల్లా -2,564 ఓట్లు
విశాఖపట్నం జిల్లా -3,333 ఓట్లు
తూర్పుగోదావరి జిల్లా -923 ఓట్లు
కృష్ణా జిల్లా -457 ఓట్లు
గుంటూరు జిల్లా -3,036 ఓట్లు
ప్రకాశం జిల్లా -3,765 ఓట్లు
నెల్లూరు -362 ఓట్లు
వైఎస్సార్ కడప జిల్లా -1,175 ఓట్లు
కర్నూలు జిల్లా -1,935 ఓట్లు
అనంతపురం జిల్లా -1,676 ఓట్లు
చిత్తూరు జిల్లా -2,185 ఓట్లు

చదవండి: ఈ నెల 27వరకు ఎన్నికల కోడ్… ఏపీలో 36 కౌటింగ్ కేంద్రాలు..
- Advertisement -