భారత్‌లో విడుదలైన యాపిల్ మ్యాక్‌బుక్ ప్రొ మోడ‌ల్స్‌…

- Advertisement -

ముంబై: ప్రపంచంలో సాఫ్ట్‌వేర్ దిగ్గజంగా కొనసాగుతున్న యాపిల్ సంస్థ తన నూతన మ్యాక్‌బుక్ ప్రొ మోడ‌ల్స్‌ను ఈరోజు భార‌త మార్కెట్‌లో విడుద‌ల చేసింది.

13 ఇంచుల మ్యాక్‌బుక్ ప్రొ ట‌చ్‌బార్‌తో రూ.1,59,900 ధ‌ర‌కు ల‌భ్యం కానుండగా, 15 ఇంచుల మ్యాక్‌బుక్ ప్రొ రూ.1,99,900 ధ‌ర‌కు వ‌చ్చే వారం నుంచి ల‌భ్యం కానుంది.

ఇక వీటిల్లో 8, 9వ జ‌న‌రేష‌న్ ఇంటెల్ కోర్ ప్రాసెస‌ర్ల‌ను ఏర్పాటు చేశారు. దీని వ‌ల్ల గ‌తంలో వ‌చ్చిన మ్యాక్‌బుక్ ప్రొల క‌న్నా కొత్త మ్యాక్‌బుక్‌ప్రొలు 40 శాతం వేగంగా ప‌నిచేస్తాయి.

అలాగే 15 ఇంచుల మాక్‌బుక్ ప్రొలో 6, 8 కోర్లు ఉన్న ఇంటెల్ ప్రాసెస‌ర్ల‌ను ఏర్పాటు చేయ‌గా, వీటిల్లో రెటీనా డిస్‌ప్లేల‌ను అమ‌ర్చారు. అలాగే ట‌చ్ ఐడీ, ట‌చ్ బార్‌, ఫోర్స్ ట‌చ్ ట్రాక్‌ప్యాడ్ త‌దిత‌ర ఫీచ‌ర్ల‌ను కూడా ఈ నూత‌న మ్యాక్‌బుక్ ప్రొల‌లో అందిస్తున్నారు. 13 ఇంచుల మ్యాక్‌బుక్ ప్రొలో ట‌చ్ బార్‌, క్వాడ్‌కోర్ ప్రాసెస‌ర్ త‌దిత‌ర ఫీచర్ల‌ను ఏర్పాటు చేశారు.

చదవండి : సూపర్ ఫీచర్స్‌తో త్వరలో భారత్‌లో విడుదల కానున్న అసుస్ జెన్‌ఫోన్ 6….

- Advertisement -