
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లోని వైసీపీ ప్రభుత్వానికి ఆ రాష్ట్ర హైకోర్టు షాక్ ఇచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమాన్ని తప్పనిసరి చేస్తూ వైఎస్ జగన్ ప్రభుత్వం జారీ చేసిన జీవో 81, జీవో 85లను కొట్టివేస్తూ బుధవారం కొట్టివేసింది.
చదవండి: కరోనా వైరస్: భారత్‌లో 11,439 పాజిటివ్ కేసులు.. 377 మంది మృతి, ఇక 20 వరకు కఠినంగా లాక్‌డౌన్…
స్కూళ్లలో ఇంగ్లీష్ మీడియంను తప్పనిసరి చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఈ రెండు జీవోలను బీజేపీ నాయకుడు సుధేష్ రాంభొట్ల, అలాగే ఏలూరుకు చెందిన డాక్టర్ గుంటుపల్లి శ్రీనివాస్ హైకోర్టులో సవాల్ చేశారు. ఈ మేరకు వారు దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై ఇదివరకే విచారణ జరిపిన హైకోర్టు తీర్పును రిజర్వ్‌లో పెట్టి.. ఈరోజు వెలువరించింది.
ముందే తప్పుబట్టిన ప్రతిపక్షాలు…
మరోవైపు పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియంను తప్పనిసరి చేస్తూ వైసీపీ ప్రభుత్వం జీవోలు జారీ చేయడంపై టీడీపీ, జనసేన వంటి ప్రతిపక్షాలు కూడా తప్పుబట్టాయి. దీనివల్ల తెలుగు భాషకు తీవ్ర అన్యాయం జరుగుతుందని ఆ పార్టీల అధినేతలు వాదించగా, సీఎం జగన్ మాత్రం ఇంగ్లీష్ మీడియం వల్ల విద్యార్థులకు మెరుగైన భవిష్యత్తు ఏర్పడుతుందనే విశ్వసిస్తూ వచ్చారు.
ఇక ఈ కేసులో పిటిషనర్ తరఫు న్యాయవాది వాదిస్తూ… ఏ మీడియంలో చదువుకోవాలనే నిర్ణయాన్ని విద్యార్థులు, వారి తల్లిదండ్రులకే వదిలేయాలని కోర్టుకు విన్నవించారు. హఠాత్తుగా ఇంగ్లీష్ మీడియంలోకి మారడం వల్ల ఎంతో మంది విద్యార్థులకు బ్యాక్‌లాగ్‌లు మిగిలిపోతాయని తెలిపారు.
చదవండి: పసిడి పరుగులే.. కొనాలంటే చుక్కలే! రూ.55,000కు చేరనున్న బంగారం ధర!?
అయితే ప్రభుత్వం తరపు న్యాయవాది మాత్రం పాఠశాల స్థాయిలో ఇంగ్లీష్ మీడియం తప్పనిసరి చేయడం వల్ల విద్యార్థులకు ఎంతో ప్రయోజనం కలుగుతుందని వాదించారు.
ఈ కేసులో ఇరు వర్గాల వాదనలు విన్న హైకోర్టు తీర్పును రిజర్వ ఛేసి, చివరికి బుధవారం వైసీపీ ప్రభుత్వం జారీ చేసిన జీవోలను కొట్టివేస్తున్నట్లు తుది తీర్పు వెలువరించింది. పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియంతో పాటు తెలుగు మీడియంను కూడా కొనసాగించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.








