28.2 C
Hyderabad
Sunday, October 11, 2026
- Advertisement -
Home వార్తలు ఆంధ్రప్రదేశ్ సీఎం హోదాలో తొలిసారి సచివాలయంలో అడుగుపెట్టనున్న జగన్…

సీఎం హోదాలో తొలిసారి సచివాలయంలో అడుగుపెట్టనున్న జగన్…

AP CM Jagan, YCP Latest News, AP Political News, Newsxpressonline
- Advertisement -

అమరావతి: నవ్యాంధ్రకి రెండో ముఖ్యమంత్రిగా వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గురువారం ప్రమాణస్వీకారం చేసిన విషయం తెల్సిందే. తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ జగన్ చేత ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయించారు.

ఇక ప్రమాణస్వీకారం అనంతరం జగన్ తొలిసారిగా సీఎం హోదాలో నేడు అమరావతిలోని ఆంధ్రప్రదేశ్ సచివాలయంలోకి అడుగుపెట్టనున్నారు. ఇక జగన్ తొలిసారిగా సెక్రటేరియేట్‌కు రానుండటంతో, పార్టీ నేత వైవీ సుబ్బారెడ్డి దగ్గరుండి నిన్న అన్నీ ఏర్పాట్లు చూసుకుంటున్నారు.

ఈరోజు, రేపు ఆయన సచివాలయంలో ఉంటారని, పరిపాలనా వ్యవహారాలు చూసుకుంటారని, శాఖలు వారీగా ఫైళ్లని పరిశీలిస్తారని పార్టీ నేతలు ప్రకటించారు. ఇక జగన్ కోసం సీఎం చాంబర్ ను అధికారులు సరికొత్తగా ముస్తాబు చేశారు. క్యాబినెట్ హాల్, హెలిపాడ్‌లు, తాడేపల్లి జగన్ నివాసం నుంచి సచివాలయం వరకూ కాన్వాయ్ రూట్ సిద్ధమయ్యాయి.

అలాగే  చాంబర్ ముందు సీఎం నేమ్ ప్లేట్‌ సిద్ధమైంది. చాంబర్‌లో మార్పులు, సీఎం నేమ్ ప్లేట్ తదితరాలను పరిశీలించిన వైవీ సుబ్బారెడ్డి సంతృప్తిని వ్యక్తం చేశారు.

చదవండి: పాలనలో జగన్ మార్క్: ఏపీ డీజీపీగా గౌతమ్ సవాంగ్…   
- Advertisement -