26.2 C
Hyderabad
Sunday, September 20, 2026
- Advertisement -
Home వార్తలు ఆంధ్రప్రదేశ్ ఇక్కడ్నించే పోటీ చేస్తానన్నాడుగా.. ఏడీ.. కనిపించడేం?: పవన్ కళ్యాణ్‌పై చంద్రబాబు సెటైర్లు…

ఇక్కడ్నించే పోటీ చేస్తానన్నాడుగా.. ఏడీ.. కనిపించడేం?: పవన్ కళ్యాణ్‌పై చంద్రబాబు సెటైర్లు…

ap-cm-chandrababu-naidu
- Advertisement -

అనంతపురం: జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యంగ్యాస్త్రాలు విసిరారు. కరవు జిల్లా అని, ఆదుకుంటానని, ఇక్కడి నుంచే పోటీ చేస్తానంటూ కల్లిబొల్లి మాటలు చెప్పిన జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఏడీ? ఎక్కడా కనిపించడే? అంటూ సెటైర్లు వేశారు.

చదవండి: పోలింగ్ జరగకముందే వైసీపీ తరపున గెలిచిన మొదటి ఎమ్మెల్యే..

అనంతపురంలో బుధవారం రోడ్ షో లో ఆయన మాట్లాడారు. ఇటీవలే ఈ ప్రాంతంలో పవన్ కళ్యాణ్ పర్యటించారని, మళ్లీ త్వరలోనే వస్తానని చెప్పిన ఆయన ఆ తరువాత ఇక్కడి ప్రజానీకానికి కనపడలేదంటూ ఎద్దేవా చేశారు.

అనంతపురం జిల్లా అంటే తనకు ఎంతో అభిమానమని, ఇక్కడి ప్రజలు మంచి మనసు కలిగిన వారని చంద్రబాబు అన్నారు. అంతేకాదు, రాష్ట్రంలోనే అధిక ఆదాయం వచ్చే జిల్లా అనంతపురం అని తాను నిరూపిస్తానని చెప్పారు.

జగన్, మోడీలపైనా విమర్శలు…

ఈ సందర్భంగా చంద్రబాబు.. వైసీపీ అధినేత జగన్, ప్రధాని నరేంద్ర మోడీపైనా విరుచుకుపడ్డారు. మోడీ దేశానికి కాపలాదారు కాదన్నారు. నేరస్థులకు, దొంగలకు ఆయన కాపలాదారులా వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు.

చదవండి: మానవా.. ఇక నువ్వు మారవా?: మళ్ళీ నోరుజారి దొరికిపోయిన నారా లోకేశ్!

31 కేసులున్న జగన్‌ను మోడీ కాపాడేందుకు ప్రయత్నిస్తున్నారని, అసలు జగన్‌పై ఉన్నన్ని కేసులు దేశంలో ఎవరిపైనా లేవని బాబు వ్యాఖ్యానించారు.

వివేకా హత్య ఇంటి దొంగల పనేనంటూ, వైసీపీ నేతలు ఈ హత్యను దాచిపెట్టాలని చూశారని, సిట్ నివేదికను బయటపెట్టొదని, సీబీఐ విచారణ కావాలని కోరుతున్నారని విమర్శించారు. ఈ ఎన్నికల్లో టీడీపీ గెలిస్తే అది ప్రజల గెలుపు అని, నేరస్తులు గెలిస్తే ప్రజలే ఓడిపోయినట్లు అని చంద్రబాబు వ్యాఖ్యానించారు.

చదవండి: జగన్ సభలో అపశ్రుతి, గోడ కూలి ఒకరి మ‌ృతి, పలువురికి గాయాలు…
- Advertisement -