23.4 C
Hyderabad
Wednesday, October 14, 2026
- Advertisement -
Home వార్తలు ఆంధ్రప్రదేశ్ రాయలసీమలో టీడీపీకి భారీ షాక్.. బీజేపీలో చేరిన కీలక నేత!

రాయలసీమలో టీడీపీకి భారీ షాక్.. బీజేపీలో చేరిన కీలక నేత!

- Advertisement -

నంద్యాల: ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీకి మరో భారీ షాక్ తగిలింది. రాయలసీమలో టీడీపీకి కీలక నేతగా ఉన్న నంద్యాల మాజీ ఎంపీ గంగుల ప్రతాపరెడ్డి గురువారం బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌రావు, ఏపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ సమక్షంలో ఆయన కాషాయ కండువా కప్పుకున్నారు.

గంగులతోపాటు నెల్లూరు జిల్లా కావలి జనసేన అభ్యర్థి పసుపులేటి సుధాకర్‌, ఆదాయపన్నుశాఖ రిటైర్డ్ కమిషనర్‌ కంచర్ల హరిప్రసాద్‌, చిత్తూరు జిల్లా టీడీపీ ఓబీసీ సెల్‌ కార్యదర్శి డి.వెంకయ్య తదితరులు బీజేపీలో చేరారు.

ఈ సందర్భంగా మురళీధర్‌రావు మాట్లాడుతూ..ప్రధాని మోదీ నాయకత్వంలో దేశం వేగంగా అభివృద్ధి చెందుతోందని అన్నారు. ఆ అభివృద్ధిలో భాగం పంచుకునేందుకే వివిధ పార్టీల నేతలు బీజేపీవైపు ఆకర్షితులవుతున్నట్టు చెప్పారు.

గంగుల ప్రతాపరెడ్డి మాట్లాడుతూ.. దేశపురోగతిపై బీజేపీ దృక్పథం నచ్చడంతోనే ఆ పార్టీలో చేరినట్టు చెప్పారు. ఏపీలో బీజేపీ బలోపేతానికి తన వంతు కృషిచేస్తానని ఆయన పేర్కొన్నారు. కాగా, నాలుగు రోజుల కిందటే ఆళ్లగడ్డకు చెందిన టీడీపీ నేత శేఖర్‌రెడ్డి బీజేపీలో చేరారు.

- Advertisement -