26.3 C
Hyderabad
Monday, October 12, 2026
- Advertisement -
Home వార్తలు ఆంధ్రప్రదేశ్ కీలక నిర్ణయాలు తీసుకున్న ఏపీ కేబినెట్

కీలక నిర్ణయాలు తీసుకున్న ఏపీ కేబినెట్

- Advertisement -

అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో ఈ రోజు జరిగిన కేబినెట్‌ సమావేశంలో ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ భేటీలో ప్రధానంగా స్థానిక ఎన్నికలపై మంత్రులతో మాట్లాడారు.

స్థానిక ఎన్నికల్లో బీసీలకు 24శాతం రిజర్వేషన్ల ప్రతిపాదనను అధికారులు ప్రభుత్వానికి అందించారు. 25 లక్షల ఇళ్ల పట్టాల పంపిణీపై కేబినెట్‌‌లో చర్చించారు. భోగాపురం ఎయిర్‌పోర్టు నిర్మాణం, ఎన్‌పీఆర్‌పై చర్చ జరిగింది. కేబినేట్ భేటీ తర్వాత మంత్రి పేర్ని నాని మీడియాతో మాట్లాడుతూ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను వెల్లడించారు.

నిర్ణయాలు ఇవే..

* మార్చి 25న ఉగాది పండుగ రోజు రాష్ట్ర వ్యాప్తంగా 25 లక్షల మంది పేదలకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేసే కార్యక్రమానికి రాష్ట్ర కేబినెట్‌ ఆమోదం.

* 43,101 ఎకరాల భూమిని ఇళ్ల స్థలాల రూపంలో పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు

* ఇంటి పట్టాను నిర్దేశిత ఫార్మాట్‌లో ప్రభుత్వమే రిజిస్ట్రేషన్‌ చేసి లబ్ధిదారులకు అందజేస్తుంది.

* ఇంటి స్థలం పొందిన లబ్ధిదారులు ఐదేళ్ల పాటు ఇళ్లు కట్టుకునేందుకు, లేదా వ్యక్తిగత అవసరాలకు బ్యాంకులో తనఖా పెట్టుకునే హక్కు కల్పిస్తూ ఐదేళ్ల తరువాత దానిని అమ్ముకునేందుకు కూడా హక్కు లభిస్తాయి.

* ఈ ప్రక్రియను సులభతరం చేసేందుకు రాష్ట్రంలో ఉన్న అందరూ తహశీల్దార్లకు జాయింట్‌ సబ్‌ రిజిస్ట్రర్‌ హోదా ఇస్తున్నారు.

* 26,976 ఎకరాల ప్రభుత్వ భూమి, 16,164 ఎకరాల ప్రైవేట్‌ భూములు కొనుగోలు చేసి ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు ప్రణాళిక

* పేదలకు ఇచ్చే కాలనీలకు వైఎస్సార్ జగనన్న కాలనీలుగా నామకరణం

* ఎన్‌పీఆర్‌లో మార్పులు కోరుతూ కేబినెట్ తీర్మానం

* 2010లో ఉన్న ప్రశ్నలకు పరిమితం అవుతూ మార్పులు చేసేవరకూ.. రాష్ట్రంలో ఎన్‌పీఆర్‌ ప్రక్రియ నిలిపివేయాలని కేబినెట్ తీర్మానం

* రామాయపట్నం పోర్టు, మచిలీపట్నం, భావనపాడు పోర్టులను రాష్ట్ర ప్రభుత్వమే స్వయంగా నిర్మించాలని నిర్ణయం

* భోగాపురం ఎయిర్‌పోర్టు పనుల్లో జీఎమ్మార్‌కు ఇచ్చిన 2700 ఎకరాలు 2200కు కుదింపు

* ఎయిర్‌పోర్ట్‌ నిర్మాణానికి అనుమతులు

* ఏపీ స్టేట్‌ సీడ్‌ కార్పొరేషన్‌కు రూ.500 కోట్ల నిధులు బ్యాంకుల నుంచి తెచ్చుకునేందుకు ఆమోదం

* విజయవాడ థర్మల్‌ పవర్‌ స్టేషన్‌లో పురోగతిలో ఉన్న 800 మెగా వాట్ల విద్యుత్‌ కేంద్రం, అలాగే కృష్ణపట్నం థర్మల్‌ ప్లాంట్‌ను పూర్తి చేసేందుకు ఏపీ జెన్‌కో రూ.1000 కోట్లు రుణం తీసుకునేందుకు కేబినెట్లో ఆమోదం. ప్రభుత్వం నుంచి వీటికి బ్యాంకు గ్యారెంటీ.

* ప్రకాశం జిల్లా ఒంగోలు పట్టణంలో టీడీపీకి కేటాయించిన రెండు ఎకరాల భూ కేటాయింపులు రద్దు.

- Advertisement -