

నవ్యాంధ్రప్రదేశ్ మరో అడుగు ముందుకేసింది. నేడు మరో కీలక ఘట్టం ఆవిష్కృతం కానుంది. అత్యాధునికమైన వసతులతో, అత్యంత ఆకర్షణీయంగా నిర్మించారు. సీఆర్‌డీఏ పరిధిలో నేలపాడులో నిర్మించిన ఈ తాత్కాలిక భవనాన్ని భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ రంజన్ గొగొయ్ ప్రారంభిస్తారు.
ఈ కార్యక్రమంలో సుప్రీంకోర్టులోని తెలుగు న్యాయమూర్తులు జస్టిస్ నూతలపాటి వెంకటరమణ, జస్టిస్ లావు నాగేశ్వరరావు, జస్టిస్ రామయ్యగారి సుభాష్‌రెడ్డి, ఏపీ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చాగరి ప్రవీణ్‌కుమార్, తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ తొట్టతిల్ బి.రాధాకృష్ణన్‌లతో పాటు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, పలువురు న్యాయమూర్తులు పాల్గొననున్నారు.
శాశ్వత హైకోర్టు కి నేడే శంకుస్థాపన..
కేవలం ఎనిమిది నెలల కాలంలోనే సీఆర్‌డీఏ ఈ భవన నిర్మాణాన్ని పూర్తి చేసింది. రాజస్థాన్ నుంచి తెప్పించిన శాండ్‌స్టోన్‌తో గోడలకి తాపడం చేశారు. ఈ భవనం పక్కనే శాశ్వత హైకోర్టు భవనానికి కూడా నేడు శంకుస్థాపన చేయనున్నారు.
శాశ్వత భవనం పూర్తయ్యాక అందులోకి హైకోర్టును తరలించి, ఇందులో సిటీ సివిల్ కోర్టులు, ట్రైబ్యునళ్లు వంటివి ఏర్పాటు చేస్తారు. నిజానికి ఇంటువంటి భవనాన్ని నిర్మించేందుకు రెండేళ్లు పడుతుందని, కానీ తాము ఎనిమిది నెలల్లోనే పూర్తి చేసి రికార్డు సృష్టించినట్టు సీఆర్‌డీఏ అధికారులు తెలిపారు. మొత్తం ఈ భవన నిర్మాణానికి రూ.173 కోట్లు అయినట్టు చెప్పారు.
చదవండి : రోజుకో లుక్‌తో అదరగొడుతున్న సీఎం చంద్రబాబు! నిన్న బ్లాక్, నేడు ఖాకీ…








