
హైదరాబాద్: టాలీవుడ్ ప్రముఖ హాస్య నటుడు అలీ గత కొన్ని రోజులుగా రాజకీయ వర్గాలలో హాట్ టాపిక్ గ మారిపోయాడు. అలీ టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి ఆప్తమిత్రుడు అని అందరికి తెలిసిందే. జగన్ ప్రజాసంకల్ప యాత్రలో ఉండగా ఆయనను కలిసి తన పొలిటికల్ ఎంట్రీకి సిగ్నల్స్ ఇచ్చిన అలీ ఆ తర్వాత వరుసగా పవన్ కల్యాణ్, చంద్రబాబునాయుడుతో కూడా భేటీ అయి తన మనసులోమాటను చెప్పుకున్నారు. దీనితో గత కొద్దీ రోజులుగా అలీ ఏ పార్టీలో చేరతాడో అని అందరూ ఎంతో ఆతృతగా ఎదురుచూసారు.
లోటస్ పాండ్‌లో జగన్ సమక్షంలో చేరిక…
ఆ వార్తలన్నికి తెర దించుతూ ఈరోజు ఉదయం ఆయన వైసీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో పార్టీ వైసీపీ కండువా కప్పుకున్నాడు. హైదరాబాద్ లోని లోటస్‌పాండ్‌లో జగన్‌తో భేటీ అయిన అనంతరం అలీ దాదాపు పావుగంటపాటు పలు అంశాలపై చర్చించారు. అనంతరం పార్టీ కండువా వేసి పార్టీలోకి అలీని జగన్ సాదరంగా ఆహ్వానించారు.
అలీ ఈరోజు వైసీపీ తీర్థం పుచ్చుకోవడంతో తన ప్రయత్నాలు ఎక్కడి నుంచి ప్రారంభించారో అక్కడికే చేరుకున్నట్లు అయింది. అలీ గుంటూరు లేదా రాజమండ్రి నుంచి వైసీపీ తరపున పోటీ చేసే అవకాశం ఉందని వైసీపీ నేతలు భావిస్తున్నారు.
అలీ వెంట సినీ నటుడు కృష్ణుడు కూడా ఉన్నారు. అలాగే షెడ్యూల్ విడుదలై ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ వైఎస్సార్ సీపీలోకి ప్రముఖుల చేరికలు ఊపందుకున్నాయి. ఈ నెల 7వ తేదీన ప్రముఖ సినీ నటి, మాజీ ఎమ్మెల్యే జయసుధ టీడీపీకి గుడ్‌బై చెప్పి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన సంగతి తెలిసిందే.
చదవండి :టీడీపీకి గట్టిషాక్ ఇచ్చిన ఈసీ!








