
- Advertisement -
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో నేడు కొత్తగా 998 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్టు రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ పేర్కొంది. నేటి కేసులలో రాష్ట్రానికి చెందిన వారు 961 మంది కాగా, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన 36 మందికి, ఇతర దేశాల నుంచి వచ్చిన ఒకరికి కరోనా సోకినట్టు పేర్కొన్నారు.
తాజా కేసులతో కలుపుకుని రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు 18,697 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 232 మంది మృతి చెందారు. 10,043 మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. 8,422 మంది మహమ్మారి బారి నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ఇక, రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 10,17,140 మందికి కరోనా పరీక్షలు నిర్వహించినట్టు అధికారులు తెలిపారు.
- Advertisement -








