28.5 C
Hyderabad
Tuesday, October 13, 2026
- Advertisement -
Home వార్తలు ఆంధ్రప్రదేశ్ వైసీపీలోకి దగ్గుబాటి వెంకటేశ్వరరావు, హితేశ్: వ్యతిరేకిస్తున్న పర్చూరు నేతలు

వైసీపీలోకి దగ్గుబాటి వెంకటేశ్వరరావు, హితేశ్: వ్యతిరేకిస్తున్న పర్చూరు నేతలు

daggubati
- Advertisement -

daggubati

హైదరాబాద్‌: తాము వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నామని మాజీ మంత్రి, సీనియర్ నేత దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఆదివారం వైసీపీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డిని తన కుమారుడు హితేశ్‌తోపాటు కలిసిన అనంతరం ప్రకటించారు. అయితే, దగ్గుబాటి రాకను వైసీపీలోని కొందరు నాయకులు వ్యతిరేకిస్తున్నారు. మొదటి నుంచి పార్టీలో ఉన్నవారికి ప్రాధాన్యత ఇవ్వాలని పార్టీ అధినేతను వారు కోరుతున్నారు.

ఆదివారం దగ్గుబాటి వెంకటేశ్వరరావు తన కుమారుడు హితేశ్‌తో కలిసి ఏపీ ప్రతిపక్ష నేత, వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డితో భేటీ అయిన విషయం తెలిసిందే. ఈ భేటీలో వైసీపీ సీనియర్‌ నాయకులు విజయసాయిరెడ్డి, వైవీ సుబ్బారెడ్డిలు, నరసరావుపేట నియోజకవర్గ లోక్‌సభ కో ఆర్డినేటర్‌ కృష్ణదేవరాయులు కూడా పాల్గొన్నారు. ఈ సమావేశం అనంతరం వెంకటేశ్వశ్వరరావు మీడియాతో మాట్లాడారు.

వైసీపీలో చేరుతున్నాం: దగ్గుబాటి

‘హితేశ్‌ వైఎస్‌ జగన్‌తో కలిసి పనిచేస్తారు. మా నిర్ణయాన్ని వైఎస్‌ జగన్‌ స్వాగతించారు. గత రెండు ఏళ్లుగా వైఎస్‌ జగన్‌ ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని పార్టీని నడుపుతున్నారు. ఆయన పడుతున్న కష్టానికి దేవుడు తగిన ప్రతిఫలం చూపెడతాడు. ప్రజలు కూడా ఆయన కష్టాన్ని గుర్తిస్తున్నారు’ అని దుగ్గుబాటి వెంకటేశ్వరరావు వ్యాఖ్యానించారు. అంతేగాక, చంద్రబాబు పాలనపై ఆయన విమర్శలు గుప్పించారు.

డబ్బులు లేవని చెబుతూ.. ప్రభుత్వ డబ్బులు ఖర్చు పెట్టి చంద్రబాబు దీక్షలు చేయడంపై దగ్గుబాటి ఆగ్రహం వ్యక్తం చేశారు. నాలుగో, ఐదో విడుత రైతుల రుణమాఫీకి ఇంకా డబ్బులు విడుదల చేయలేదని అన్నారు. పోస్ట్‌ డేటెడ్‌ చెక్కులతో డ్వాక్రా మహిళలకు డబ్బులు ఇస్తామని చెబుతున్నారని.. ఇంత విచిత్రమైన పాలనను ఎప్పుడూ చూడలేదని అన్నారు. కాగా, మీడియా అడిగిన ఓ ప్రశ్నకు సమాధానంగా.. తన భార్య పురంధేశ్వరి బీజేపీలోనే కొనసాగుతారని దగ్గుబాటి వెంకటేశ్వరావు స్పష్టం చేశారు.

దగ్గుబాటి రాకను వ్యతిరేకిస్తున్న వైసీపీ నేతలు

మాజీ ఎంపీ దగ్గుబాటి వెంకటేశ్వరరావు, ఆయన కుమారుడు హితేశ్‌ వైసీపీలో చేరనుండటంపై ఆ పార్టీ శ్రేణుల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. దగ్గుబాటి రాకను నిరసిస్తూ ఆయన సొంత నియోజకవర్గం ప్రకాశం జిల్లా పర్చూరు రోటరీ భవన్‌లో వైసీపీ నేతలు సమావేశమయ్యారు. అధికారం ఎక్కడ ఉంటే దగ్గుబాటి అక్కడ ఉంటారని.. పార్టీలో పనిచేస్తున్నవారికి అన్యాయం చేయొద్దని నేతలు అధిష్ఠానానికి విజ్ఞప్తి చేశారు. దగ్గుబాటి కుటుంబానికి టికెట్‌ ఇచ్చే సంప్రదాయం మంచిదికాదని అధిష్టానం దృష్టికి తీసుకెళ్తున్నారు.

- Advertisement -