![]()
స్క్రీన్‌పై అద్భుతాలు చూపించడంలో సిద్ధహస్తుడైన ఆ హాలీవుడ్ ఫిల్మ్ మేకర్ డైరెక్టర్ జేమ్స్ కేమరాన్. ఇప్పుడు ఒకేసారి రెండు సినిమాలతో డబుల్ ధమాకా ఇవ్వడానికి సిద్ధమవుతున్నాడు. సీక్వెల్స్‌గా అలరించడానికి సిద్ధమవుతోన్నరెండు చిత్రాలు.. ప్రేక్షకుల్ని సరికొత్త ప్రపంచంలో తీసుకెళ్లబోతున్నాయట.
ఏదైనా ఒక సినిమా హిట్టవ్వగానే.. దానికి కొనసాగింపుగా సీక్వెల్స్ రావడం సర్వసాదరణం. అయితే సూపర్ డూపర్ హిట్టయిన హాలీవుడ్ సినిమా ‘అవతార్’ చిత్రానికి ఒకేసారి నాలుగు సీక్వెల్స్ ప్రకటించి.. అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తాడు డైరెక్టర్ జేమ్స్ కేమరాన్. ఇక ప్రకటించడంతోనే అగకుండా తాజాగా ‘అవతార్’ సిరీస్‌లో రెండు, మూడు సీక్వెల్స్ షూటింగ్‌ను కూడా పూర్తి చేసేశాడట.
తొమ్మిదేళ్ల క్రితం…
పండోరా అనే సరికొత్త ప్రపంచాన్ని పరిచయం చేసి తొమ్మిది సంవత్సరాల క్రితం ‘అవతార్’ సినిమాతో అరుదైన విజయాన్ని అందుకున్నాడు జేమ్స్. ‘అవతార్’ సినిమా ఏకంగా 2.7 బిలియన్ డాలర్ల వసూళ్లు సాధించి ఇప్పటి వరకూ ప్రపంచంలోనే అత్యధిక కలెక్షన్లు సాధించిన చిత్రంగా సరికొత్త రికార్డు నెలకొల్పింది.
2020 డిసెంబర్లో ‘అవతార్-2’…
ఇక 2020 డిసెంబర్లో విడుదలయ్యే ‘అవతార్-2’.. అలాగే 2021 డిసెంబర్లో విడుదలయ్యే ‘అవతార్-3’ సినిమాలు.. మొదటి భాగానికి మించిన రీతిలో హై వోల్టేజ్ యాక్షన్ ఘట్టాలతో సిద్ధమవుతున్నాయట.
యాక్షన్ అండర్ వాటర్…
‘అవతార్’ మొదటి భాగంలో పండోరా గ్రహంలోని నావి ప్రజలతో.. నేలమీద, ఆకాశంలో సాహసాలు చూపించిన జేమ్స్ కేమరాన్.. అవతార్-2, 3 పార్టులలో నేల, ఆకాశం కాకుండా అండర్ వాటర్‌పై ఎక్కువ దృష్టి పెట్టాడట. గతంలో తాను తెరకెక్కించిన ‘అబిస్’ చిత్రం తరహాలో అండర్ వాటర్‌లో.. ఒళ్లు గగుర్పొడిచే యాక్షన్ సీక్వెన్సెస్‌ను చూపించబోతున్నాడట.
ఇప్పటికే షూటింగ్ మొత్తం పూర్తి చేసుకున్న ఈ సీక్వెల్స్.. శరవేగంగా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్నాయి. మొత్తం మీద మరో రెండేళ్లలో ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ‘అవతార్-2’.. మూడేళ్లలో అలరించడానికి సిద్ధమవుతోన్న ‘అవతార్-3’ చిత్రాలతో జేమ్స్ కేమరాన్ ఎలాంటి సంచలనాలకు తెర తీస్తాడో చూడాలి.







