23.3 C
Hyderabad
Thursday, November 5, 2026
- Advertisement -
Home వార్తలు ఆంధ్రప్రదేశ్ షర్మిల కేసు: విచారణ ముమ్మరం, ఇద్దరు నిందితుల కస్టడీ కోరిన సైబర్ క్రైమ్! సూత్రధారులెవరో తేల్చేస్తారా?

షర్మిల కేసు: విచారణ ముమ్మరం, ఇద్దరు నిందితుల కస్టడీ కోరిన సైబర్ క్రైమ్! సూత్రధారులెవరో తేల్చేస్తారా?

sharimila case information
- Advertisement -

sharimila case information

ఆంధ్రప్రదేశ్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోదరి షర్మిలపై సోషల్‌ మీడియాలో జరిగిన ప్రచారంపై నమోదైన కేసులో హైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. గత సార్వత్రిక ఎన్నికల సమయంలో షర్మిలపై విపరీతంగా ట్రోల్ చేసిన విషయం తెలిసిందే.

కాగా, ఆ తరువాత ఈ విషయాన్ని అందరూ వదిలేశారు. కానీ, మళ్ళీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో వైసీపీ మహిళా నేత షర్మిలపై సోషల్ మీడియా వేదికగా దుష్ప్రచారం రోజు రోజుకి ఎక్కువైంది. దీంతో  షర్మిల హైదరాబాద్ పోలీసు కమిషనర్‌కు పిర్యాదు చేసింది.  ఈ నేపథ్యంలో ఈ కేసు దర్యాప్తులో పోలీసులు వేగం పెంచారు.

ఇప్పటికే ఇద్దరు నిందితుల అరెస్ట్..

అటు గూగుల్‌, యూట్యూబ్‌లను, ఇటు ఫేస్‌బుక్‌ అధికార ప్రతినిధులను లేఖల ద్వారా సంప్రదించిన సైబర్ క్రైమ్ పోలీసులు.. నిందితులు ఉపయోగించిన ఐపీ అడ్రెస్‌‌లను రాబట్టి.. వారిని గుర్తించడంతో సఫలీకృతమయ్యారు.  షర్మిల కేసులో ఇప్పటి వరకు ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.

అరెస్ట్ అయిన ఇద్దరూ.. గుంటూరు జిల్లా తెనాలికి చెందిన పెద్దిశెట్టి వెంకటేశ్వర్లు, మంచిర్యాల ప్రాంత వాసి అద్దూరి నవీన్‌ కాగా.. వీరిద్దరిని సైబర్ క్రైమ్ పోలీసులు కోర్టులో హాజరుపరిచారు.

తాజాగా కస్టడీ కోరుతూ పిటిషన్…

అయితే ఈ కేసులో సైబర్‌క్రైమ్‌ విభాగం పోలీసులు న్యాయస్థానంలో తాజాగా ఓ పిటిషన్‌ దాఖలు చేశారు నిందితుల నుంచి మరిన్ని వివరాలు రాబట్టాల్సి ఉందని, కాబట్టి వారిని విచారణ కోసం వారం రోజులపాటు తమ కస్టడీకి అప్పగించాలంటూ ఆ పిటిషన్‌లో అభ్యర్థించారు.

అలాగే ఈ వ్యవహారం వెనుక ఉన్న అసలు సూత్రధారుల్ని గుర్తించేందుకు కూడా పోలీసులు ప్రయత్నిస్తున్నారు.  దీనికోసం ప్రాథమికంగా ఆయా అంశాలతో కూడిన వీడియోలను సృష్టిస్తూ యూట్యూబ్‌లోకి అప్‌లోడ్‌ చేసిన వారి వివరాలు తెలియాల్సి ఉంది.  ఇద్దరు నిందితులను తమ కస్టడీలోకి తీసుకుని విచారిస్తే.. ఈ కేసులో సూత్రధారులెవరో, పాత్రధారులెవరో మరింత స్పష్టత వస్తుందని పోలీసులు భావిస్తున్నారు.

సంబంధిత వార్తలు

షర్మిల ఫిర్యాదు: పోలీసుల అదుపులో ఆరుగురు అనుమానితులు? బీటెక్ యువకుడు సహా…

షర్మిల ఫిర్యాదు: దూకుడు పెంచిన పోలీసులు, 12 వెబ్‌సైట్లు గుర్తింపు.. గూగుల్, యూట్యూబ్‌‌లకు లేఖలు!

వైఎస్ షర్మిలకు విజయశాంతి మద్దతు.. న్యాయం జరిగే వరకూ పోరాడాలంటూ పిలుపు…

ప్రభాస్‌ను ఎన్నడూ కలవలేదు.. మాట్లాడలేదు, అన్నీ పుకార్లే: వైఎస్ షర్మిల, కమిషనర్‌కు ఫిర్యాదు

షర్మిల కేసులో యువకుడి అరెస్ట్! హైదరాబాద్‌కి తరలింపు!

- Advertisement -