

అమరావతి: ఆంధ్రప్రదేశ్ ఆర్థికశాఖ మంత్రి యనమల రామకృష్ణుడు 2019-20 సంవత్సరానికి గాను ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను మంగళవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. 11వ బడ్జెట్‌ను ప్రవేశపెట్టడం తనకు గర్వకారణంగా ఉందన్నారు. విభజనలో అన్యాయం జరిగినప్పటికీ రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తున్నామన్నారు.
2019-20 బడ్జెట్ అంచనా రూ.2,26,117.53కోట్లు కాగా, గతేడాది కన్నా ఇది 18.38శాతం పెరుగుదల. రెవెన్యూ వ్యయం రూ.1,80,369.33కోట్లు(20.03శాతం పెంపు) కాగా, మూలధన వ్యయం రూ.29,596.33కోట్లు, రెవెన్యూ మిగులు రూ.2099.47కోట్లుగా అంచనా వేయగా, ఆర్థికలోటు 32,390.68కోట్లుగా అంచనా వేశారు. ఈ బడ్జెట్‌లో రైతులకు మరో వినూత్న పథకం రైతు సంక్షేమం కోసం ‘అన్నదాత సుఖీభవ’ పథకం. ఈ పథకానికి రూ.5వేల కోట్లు కేటాయించారు.
ఆంధ్రప్రదేశ్ ఓటాన్ అకౌంట్ బడ్జెట్: రూ.2,26,117.53కోట్లు
– వ్యవసాయ మార్కెటింగ్, కో-ఆపరేటివ్‌కు రూ.12,732.97కోట్లు
– పాడి పశు సంవర్ధక, మత్స్యశాఖకు రూ.2,030.87కోట్లు
– అటవీ పర్యావరణ, శాస్త్ర సాంకేతిక రంగాలకు రూ.491.93కోట్లు
– వెనుకబడిన తరగతుల సంక్షేమానికి రూ.8,242.64కోట్లు
– ఆహార శుద్ధి పరిశ్రమలకు రూ.300కోట్లు.
– మార్కెట్ ఇంటర్వెన్షన్ ఫండ్ రూ.1000 కోట్లు
– పశుగ్రాసం అభివృద్ధికి రూ.200 కోట్లు.
– పశువులపై బీమా కోసం రూ.200కోట్లు
– చిన్న, మధ్యతరహా పరిశ్రమల ప్రోత్సాహానికి రూ.400 కోట్లు
– డ్రైవర్స్ సాధికార సంస్థకు రూ.150కోట్లు
– ఇళ్ల స్థలాల సేకరణ కోసం రూ.500 కోట్లు
– క్షత్రియుల సంక్షేమం కోసం రూ.50కోట్లు
– వెనుకబడిన వర్గాల కార్పొరేషన్లకు రూ.3వేల కోట్లు
– బ్రాహ్మణ కార్పొరేషన్‌కు రూ.100 కోట్లు
– పరిశ్రమలు, వాణిజ్యం రూ.4,114.92 కోట్లు
– ఐటీ, కమ్యూనికేషన్స్‌కు రూ.1006.81 కోట్లు
– కార్మిక ఉపాధి కల్పనకు రూ.1,225.75కోట్లు
– న్యాయశాఖకు రూ.918.కోట్లు
– శాసనసభ వ్యవహారాల శాఖకు రూ.149.90 కోట్లు
– పురపాలక పట్టణాభివృద్ధికి శాఖకు రూ.7,979.34కోట్లు
– మైనార్టీ సంక్షేమానికి రూ.1,308.73కోట్లు
– ప్రభుత్వ రంగ సంస్థలకు రూ.2.56కోట్లు
– ప్రణాళిక విభాగానికి రూ.1,403.17కోట్లు
– పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధికి రూ.35,182.61కోట్లు
– రెవెన్యూశాఖకు రూ.5,546.94కోట్లు
– మైనార్టీలకు దుల్హన్ పథకం కింద రూ.100 కోట్లు
– చంద్రన్న పెళ్లికానుక కింద ఎస్సీలకు రూ.128కోట్లు
– 8,10 తరగతుల విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకానికి రూ.156కోట్లు
– చేనేతలకు రూ.225కోట్లు
– అన్న క్యాంటీన్లకు రూ.300కోట్లు
– డ్వాక్రా మహిళలకు వడ్డీలేని రుణాల కింద రూ.1,100 కోట్లు
– ముఖ్యమంత్రి యువనేస్తం రూ.1200కోట్లు
– వృద్ధాప్య, వితంతు పింఛన్ల కోసం రూ.10,401కోట్లు
– ఎన్టీఆర్ విదేశీ విద్య పథకానికి రూ.100కోట్లు
– పింఛన్ల కింద విభిన్న ప్రతిభావంతులకు రూ.2,133కోట్లు
– ఉపాధి హామీ పథకానికి రూ.1000కోట్లు
– రాజధానిలో భూసమీకరణకు రూ.226కోట్లు
– రాష్ట్రంలో రైల్వేలైన్ల నిర్మాణానికి రూ.150కోట్లు
– ఆర్టీజీఎస్‌కు రూ.172.12కోట్లు
– దివ్యాంగుల సంక్షేమానికి రూ.70కోట్లు
– కాపుల సంక్షేమానికి రూ.1000కోట్లు
– సౌకర్యాలకు ఎస్సీ కాంపోనెంట్ నుంచి రూ.600.56కోట్లు
– 308 కాపు భవనాల నిర్మాణానికి రూ.123కోట్లు
– వైశ్యుల సంక్షేమానికి రూ.50కోట్లు
– రోడ్లు, భవనాలు, రవాణాశాఖకు రూ.5,382.83కోట్లు
– మహిళ, శిశు, దివ్యాంగులు, వృద్ధులకు రూ.3,408.66కోట్లు
– సర్వీసులు, క్రీడలకు రూ.1,982.74కోట్లు
– ఉన్నత విద్యాశాఖకు రూ.3,171.63కోట్లు
– సెకండరీ విద్యాశాఖకు రూ.3,171.63కోట్లు
– విద్యుత్, మౌలిక వనరులకు రూ.5,473.83కోట్లు
– పౌరసరఫరాలశాఖకు రూ.3,763.42కోట్లు
– ఆర్థికశాఖకు రూ.51,841.69కోట్లు
– సాధారణ పరిపాలన రూ.1,177.56కోట్లు
– వైద్యం, ఆరోగ్య, కుటుంబ సంక్షేమం రూ.10,032.15కోట్లు
– హోంశాఖకు రూ.6,397.94కోట్లు
– గృహ నిర్మాణానికి రూ.4,079.10కోట్లు
– జలవనరులశాఖకు రూ.16,852.27కోట్లు








