22.7 C
Hyderabad
Friday, November 27, 2026
- Advertisement -
Home క్రికెట్ వరల్డ్ కప్ ఫైట్: అఫ్గాన్ వర్సెస్ ఆసీస్….శ్రీలంక వర్సెస్ కివీస్…

వరల్డ్ కప్ ఫైట్: అఫ్గాన్ వర్సెస్ ఆసీస్….శ్రీలంక వర్సెస్ కివీస్…

- Advertisement -

లండన్:  ఇంగ్లండ్ వేదికగా జరుగుతున్న వన్డే ప్రపంచ కప్‌లో ఈరోజు రెండు ఆసక్తికరమైన పోరులు జరగనున్నాయి. ఐదు సార్లు ప్రపంచ కప్‌ని గెలుచుకున్న డిఫెండింగ్ ఛాంపియన్‌తో పసి కూన అఫ్గానిస్తాన్ తలపడనుంది. ఇక మరో మ్యాచ్‌లో న్యూజిలాండ్ జట్టు శ్రీలంకని ఢీకొననుంది.

బలాబలాల పరంగా చూసుకుంటే పసికూన అఫ్గాన్‌ని ఎదురుకోవడం ఆసీస్‌కి సులువే. ఏడాది నిషేధం పూర్తి చేసుకుని ఇటీవలే జట్టులోకి వచ్చిన డేవిడ్ వార్నర్, స్టీవ్ స్మిత్ సత్తాచాటేందుకు పట్టుదలతో కనిపిస్తున్నారు.

అలాగే కెప్టెన్ ఆరోన్ ఫించ్‌.. ఉస్మాన్ ఖవాజ,  షాన్ మార్ష్, స్టీవ్ స్మిత్, మ్యాక్స్‌వెల్, స్టోయినిస్‌తో కంగారూల బ్యాటింగ్ ఆర్డర్ బలంగా ఉంది. అటు బౌలింగ్‌లో స్పీడ్‌స్టర్ మిచెల్ స్టార్క్, ప్యాట్ కమ్మిన్స్‌కు తోడుగా నాథన్ కౌల్టర్‌నైల్, ఆడమ్ జంపా బరిలోకి దిగే అవకాశముంది.   అయితే పసికూన కూడా స్ట్రాంగ్‌గానే ఉంది. ఆ జట్టుని తక్కువ అంచనా వేస్తే అంతే సంగతులు.

బలంగా ఉన్న కివీస్.

ఇక మరో మ్యాచ్‌లో లంక కంటే న్యూజిలాండ్ జట్టు పటిష్టంగా కనిపిస్తోంది. వార్మప్ మ్యాచ్‌లో భారత్‌ను దెబ్బకొట్టిన కివీస్ బౌలర్లు లంకకి చుక్కలు చూపించేందుకు సిద్ధమవుతున్నారు.  మరోవైపు కష్టకాలంలో ఉన్న లంకేయులు సీనియర్లు మలింగ, మాథ్యూస్‌పైనే ఎక్కువ ఆధారపడుతున్నారు.

ఇక అన్ని రంగాల్లో పటిష్ఠంగా ఉన్న న్యూజిలాండ్‌ను లంక ఏ మేరకు నిలువరిస్తుందో చూడాలి.

చదవండి: విండీస్ చేతిలో చిత్తూ చిత్తుగా ఓడిన పాక్!
- Advertisement -