
- Advertisement -
న్యూఢిల్లీ: కరోనా కారణంగా భారత జట్టు శ్రీలంక పర్యటన వాయిదా పడింది. శ్రీలంక పర్యటనలో భాగంగా భారత జట్టు జూలైలో 3 వన్డేలు, 3 టీ20 మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది.
కానీ కరోనా వైరస్ విజృంభిస్తుండడంతో భారత క్రికెటర్లను శ్రీలంక పంపలేమని బీసీసీఐ స్పష్టం చేసింది.
ఆటగాళ్ల ఆరోగ్యం దృష్ట్యా పర్యటన ఏర్పాటు చేయలేమని నిస్సహాయత వ్యక్తం చేస్తూ శ్రీలంకలో టీమిండియా పర్యటనను రద్దు చేసింది.
చాలా కాలంగా మ్యాచ్‌లు లేకపోవడంతో అభిమానులు ఈ సిరీస్‌పై ఆశలు పెంచుకున్నారు. అయితే, బీసీసీఐ తాజా పర్యటన వారిని నిరాశకు గురిచేసింది.
అయితే, ఐపీఎల్ నిర్వహణకు బీసీసీఐ ఏర్పాట్లు చేస్తుండడం మాత్రం అభిమానులకు కొంత ఊరటనిచ్చే అంశం.
- Advertisement -








