22.7 C
Hyderabad
Friday, November 27, 2026
- Advertisement -
Home క్రికెట్ స్మిత్ చీటర్… అలా అవమానించొద్దని అభిమానులకు కోహ్లీ సూచన

స్మిత్ చీటర్… అలా అవమానించొద్దని అభిమానులకు కోహ్లీ సూచన

- Advertisement -

హైదరాబాద్: లండన్ లోని ఓవల్ మైదానం వేదికగా నిన్న జరిగిన ఇండియా, ఆస్ట్రేలియా వరల్డ్ కప్ క్రికెట్ మ్యాచ్ లో ఆస్ట్రేలియా ఆటగాడు స్మిత్ ను కొందరు ఆకతాయిలు వేధించారు.

చదవండి: కొత్త ట్విస్ట్: ప్రజావేదిక కోసం వైసీపీ లేఖ రాయలేదంట….

ఆస్ట్రేలియా ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో స్మిత్ ను చూసి చీటర్ చీటర్ అంటూ కొందరు భారతీయ ఆకతాయి అభిమానులు నినాదాలు చేశారు. దీనిని గమనించిన భారత జట్టు కెప్టెన్ కోహ్లీ వారిని వారించే ప్రయత్నం చేశాడు. అలా చేయొద్దని కోరాడు.

రెండో ఇన్నింగ్స్ లోనూ ఆస్ట్రేలియా బ్యాటింగ్ చేస్తున్న సమయంలో బ్యాటింగ్ కు వస్తున్న స్మిత్ ని చూసి మళ్ళీ చీటర్ అంటూ అరిచారు. అప్పుడు కూడా కోహ్లీ అలా చేయకూడదని అభిమానులకు సూచించాడు.

మ్యాచ్ అనంతరం ప్రెస్ కాన్ఫరెన్స్ లో ఈ తతంగం గురించి వివరించాడు. భారత అభిమానులు మంచిగా మెలగాలన్న ఉద్దేశంతో వారించినట్లు కోహ్లీ చెప్పాడు.

- Advertisement -