26.2 C
Hyderabad
Friday, November 27, 2026
- Advertisement -
Home వార్తలు ఆంధ్రప్రదేశ్ దేవినేని ఉమాపై కేశినేని పంచ్… కొడాలి నాని జీవితాంతం కృతజ్ఞుడిగా ఉండాలి

దేవినేని ఉమాపై కేశినేని పంచ్… కొడాలి నాని జీవితాంతం కృతజ్ఞుడిగా ఉండాలి

Kesineni Nani News, Devineni Uma News, Kodali Nani Latest News, Newsxpressonline
- Advertisement -

విజయవాడ: గత కొన్ని రోజుల నుంచి తెలుగుదేశం అధిష్టానంపై తీవ్ర అసంతృప్తిగా ఉన్న విజయవాడ ఎంపీ కేశినేని నాని…తాజాగా సొంత మాజీ నేత దేవినేని ఉమా లక్ష్యంగా సెటైర్ వేశారు.

ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో కొడాలి నాని గుడివాడ నుంచి వైసీపీ తరుపున గెలిచి…జగన్ కేబినెట్‌లో స్థానం సంపాదించారు. ఈ నేపథ్యంలోనే కేశినేని తన ఫేస్‌బుక్ ఖాతా ద్వారా ఓ సెటైరికల్ పోస్ట్ పెట్టారు. తాను మంత్రి అవ్వడానికి కారణమైన దేవినేని ఉమాకు, కొడాలి నాని జీవితాంతం కృతజ్ఞుడిగా ఉండాలని వ్యాఖ్యానించారు.

కాగా, టీడీపీలో ఉన్నప్పుడూ కొడాలి నాని, దేవినేని ఉమా మధ్య విభేదాలు ఉన్న విషయం తెలిసిందే. ఉమా వైఖరి కారణంగానే కొడాలి 2014 ఎన్నికలకు ముందు టీడీపీని వీడి వైసీపీలో చేరారు. ఆ ఎన్నికల్లో గెలిచిన నాని…ఇప్పుడు మరోసారి గెలిచి మంత్రి పదవి దక్కించుకున్నారు.

ఇక ఈ పరిణామాలని దృష్టిలో పెట్టుకునే కేశినేని ఉమాపై పరోక్షంగా సెటైర్లు వేసినట్లు తెలుస్తుంది.

చదవండి:  చంద్రబాబుపై మంత్రి సంచలన వ్యాఖ్యలు: కన్నా ఆ రోజే చెప్పారు
- Advertisement -