25 C
Hyderabad
Monday, October 12, 2026
- Advertisement -
Home క్రికెట్ అదరగొట్టిన గిల్….‌పంజాబ్‌ని చిత్తు చేసిన కోల్‌కతా

అదరగొట్టిన గిల్….‌పంజాబ్‌ని చిత్తు చేసిన కోల్‌కతా

- Advertisement -

మొహాలీ: ప్లే ఆఫ్ బరిలో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ దుమ్ము లేపింది. ఐపీఎల్ 52వ మ్యాచ్‌లో భాగంగా శుక్రవారం రాత్రి మొహాలీ వేదికగా జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా పంజాబ్‌ని చిత్తుగా ఓడించింది.

తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 183 పరుగులు చేసింది. స్యామ్ కరన్ 24 బంతుల్లో 55 నాటౌట్, నికోలస్ పూరన్ 27 బంతుల్లో 48పరుగులు, మయాంక్ అగర్వాల్ 26 బంతుల్లో 36 పరుగులతో రాణించారు. ఇక కోల్‌కతా బౌలర్లలో సందీప్ వారియర్ (2/31) ఆకట్టుకున్నాడు.

అనంతరం 184 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కోల్‌కతా 18 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేధించింది.  శుభ్‌మన్ గిల్ 49 బంతుల్లో 65 నాటౌట్, క్రిస్ లిన్ 22 బంతుల్లో 46 పరుగులతో అదరగొట్టడంతో పంజాబ్‌పై సునాయాస విజయం సాధించారు.

ఈ విజయంతో కోల్‌కతా ప్లే ఆఫ్ రేసులోకి ముందుకు వచ్చింది. ఇక ఈ ఓటమితో పంజాబ్ ప్లే ఆఫ్స్ అవకాశాలని దూరం చేసుకుంది. అదిరిపోయే ఇన్నింగ్స్ ఆడి మ్యాచ్ విజయంలో కీలకపాత్ర పోషించిండ్ గిల్‌కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.

చదవండి:ఉత్కంఠ పోరులో సన్‌రైజర్స్ ఓటమి.. ప్లే ఆఫ్స్ చేరిన ముంబై!

 

- Advertisement -