
లండన్: ప్రపంచకప్‌లో టీమిండియా రెండో విజయాన్ని నమోదు చేసింది. ఓవల్ వేదికగా డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియాని మట్టికరిపించి కోహ్లీ సేన అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. ఓపెనర్ ధవన్ తనకి కలిసొచ్చిన ఓవల్ మైదానంలో చెలరేగడం….బౌలర్లు కూడా అద్భుతంగా బౌలింగ్ వేసి ఆసీస్ బ్యాట్స్‌మెన్‌ని కట్టడి చేయడంతో 36 పరుగుల తేడాతో భారత్ విజయం సాధించింది.
టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన కోహ్లీ సేన 50 ఓవర్లలో 5 వికెట్లకు 352 పరుగులు చేసింది. ఓపెనర్ శిఖర్ ధవన్ (109 బంతుల్లో 117; 16 ఫోర్లు) సెంచరీతో చెలరేగితే.. కెప్టెన్ విరాట్ కోహ్లీ (77 బంతుల్లో 82; 4 ఫోర్లు, 2 సిక్సర్లు), రోహిత్ శర్మ (70 బంతుల్లో 57; 3 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ శతకాలతో అదరగొట్టారు.
ఇక చివర్లో హార్దిక్ పాండ్యా (27 బంతుల్లో 48; 4 ఫోర్లు, 3 సిక్సర్లు), మహేంద్ర సింగ్ ధోనీ (14 బంతుల్లో 27; 3 ఫోర్లు, 1 సిక్స్) హిట్టింగ్ చేయడంతో భారత్ భారీ స్కోరు చేసింది. అనంతరం 353 పరుగుల లక్ష్య ఛేదనలో ఆస్ట్రేలియా 50 ఓవర్లలో 316 పరుగులకు ఆలౌటైంది.
వార్నర్ (56; 5 ఫోర్లు), స్మిత్ (69; 5 ఫోర్లు, 1 సిక్స్), అలెక్స్ (55; 5 ఫోర్లు, 1 సిక్స్) రాణించిన భారీ టార్గెట్ ఉండటంతో ఓటమి పాలయ్యారు. ఇక భారత్ బౌలర్లలో భువనేశ్వర్, బుమ్రాకు చెరో 3 వికెట్లు దక్కగా, చహల్‌కి 2 వికెట్లు దక్కాయి. సెంచరీ చేసిన ధవన్‌ను మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు వరించింది.
ఇక భారత్ తన తదుపరి మ్యాచ్ ఈనెల 13న న్యూజిలాండ్‌తో తలపడుతుంది.








