బెంగళూరు: ఐపీఎల్ 12వ సీజన్ ప్రారంభం నుంచి ఘోరంగా ఆడుతూ… పరాజయాలని సొంతం చేసుకున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ప్లే ఆఫ్ రేసు నుంచి నిష్క్రమించింది. అటు వరుస ఓటములతో రాజస్థాన్ రాయల్స్ కూడా ప్లే ఆఫ్ ఆశలని క్లిష్ట తరం చేసుకుంది.
చదవండి: అత్తింట్లో గొడవ.. క్రికెటర్ షమీ భార్య అరెస్ట్.. బెయిల్‌పై విడుదల
మంగళవారం బెంగళూరు వేదికగా రాజస్థాన్, బెంగళూరు జట్ల జరిగిన మ్యాచ్ వర్షార్పణం కావడంతో… మ్యాచ్ టైగా ముగిసింది. దీంతో ఇరు జట్లకి చెరో పాయింట్ వచ్చింది. ఇక బెంగళూరు పాయింట్ల పట్టికలో చిట్టచివరి స్థానాన్ని దక్కించుకుంది. రాజస్థాన్ ఐదో స్థానంలో నిలిచింది. మిగిలిన జట్ల గెలుపోటములని బట్టి రాజస్థాన్ ప్లే ఆఫ్ ఆశలు ఆధారపడి ఉంటాయి.
ఆరంభం నుంచీ వర్షం, మధ్యలో…
అయితే మ్యాచ్ ప్రారంభ సమయం దగ్గర నుంచి కురుస్తున్న వర్షం మధ్యలో తెరపివ్వడంతో… మ్యాచ్‌ని ఐదు ఓవర్లకి కుదిరించారు. ఇక టాస్ ఓడి బ్యాటింగ్‌కి దిగిన బెంగళూరు జట్టుకి కెప్టెన్ కోహ్లీ, సీనియర్ ఆటగాడు డివిలియర్స్‌లు మంచి ఆరంభాన్ని ఇచ్చారు.
కోహ్లీ (7 బంతుల్లో 25; 1 ఫోర్, 3 సిక్సర్లు), ఏబీ డివిలయర్స్ (4 బంతుల్లో 10; 2 ఫోర్లు) రాణించారు. కానీ తర్వాత గోపాల్ దెబ్బకి బెంగళూరు జట్టు వరుస వికెట్లని కోల్పోయి…చివరికి 5 ఓవర్లలో 7 వికెట్లు నష్టపోయి 62 పరుగులు చేసింది.
చదవండి: డీపీఎల్‌లో చితక్కొట్టిన సౌమ్య సర్కార్.. 16 సిక్సర్లతో 208 పరుగులు
అనంతరం 63 పరుగుల విజయలక్ష్యంతో బరిలో దిగిన రాజస్థాన్ జట్టు దూకుడుగా ఆడింది. అయితే రాజస్థాన్ 3.2 ఓవర్లలో 41/1తో గెలుపు దిశగా వెళుతున్న సమయంలో మరోసారి వర్షం పడటంతో మ్యాచ్ ఆగిపోయింది. మళ్ళీ ఆడటానికి కుదరకపోవడంతో అంపైర్లు మ్యాచ్ టై అయినట్లు ప్రకటించి…ఇరు జట్లకు చెరో పాయింట్ కేటాయించారు.








