
బెంగుళూరు: ఐపీఎల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పరాజయాల పరంపర కొనసాగుతోంది. వరుసగా ఐదో మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ సారథ్యంలోని బెంగళూరు పరాజయం చెందింది. బెంగళూరు వేదికగా జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై 5 వికెట్ల తేడాతో కోల్‌కత్తా నైట్ రైడర్స్ విజయం సాధించింది.
ముందుగా బ్యాటింగ్ చేసిన బెంగుళూరు నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 205 పరుగులు సాధించింది. 206 పరుగుల భారీ విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన కోల్‌కత్తా నైట్ రైడర్స్..19.1 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి విజయలక్ష్యాన్ని ఛేదించింది. ఆండ్రూ రసెల్ 48(13 బంతుల్లో 7×6, 1×4) మెరుపు ఇన్నింగ్స్‌తో తమ జట్టును విజయం ఒడ్డుకు చేర్చాడు.
బెంగుళూరు విజయం ఖాయమనుకున్న సమయంలో తన విధ్వంసకర బ్యాటింగ్‌తో మ్యాచ్ గతినే పూర్తిగా మార్చేశాడు రసెల్. 19వ ఓవర్‌లో రసెల్ 4 సిక్సర్లు, ఒక బౌండరీ బాది జట్టును గెలిపించాడు.
అంతకు ముందు ఓపనర్లు క్రిస్ లిన్(43), ఊతప్ప(33), నితీష్ రాణా(37), దినేష్ కార్తిక్(19) కూడా రాణించారు. కోల్‌కతా బ్యాట్స్‌మన్లు సమిష్టిగా రాణించడంతో కొండంత స్కోరు కూడా కరిగిపోయింది.








