
ఇంగ్లాండ్: స్వదేశంలో జరుగుతున్న ప్రపంచ కప్ టోర్నీలో ఇంగ్లాండ్ బ్యాట్ మెన్స్ అదరగొట్టారు. దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మొదటి మ్యాచ్ లోనే ఇంగ్లీష్ బ్యాట్ మెన్స్ అందరు తలో చేయి వేసి మంచి స్కోరు అందించారు.
ఓపెనర్ రాయ్ (53 బంతుల్లో 54), రూట్ (59 బంతుల్లో 51), మోర్గాన్ (60 బంతుల్లో 57), బెన్ స్టోక్ (79 బంతుల్లో 89) లు అర్థశతకాలతో ఆకట్టుకున్నారు. దీంతో ఇంగ్లాండ్ నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 311 పరుగులు చేయగలిగింది.
సఫారీ బౌలర్లలో ఎంగిడి 3, ఇమ్రాన్ తాహిర్ 2, రబడ 2, పెహ్లుక్వాయో 1 వికట్ పడగొట్టారు. దక్షిణాఫ్రికా బౌలర్లు విరామం లేకుండా వికెట్లు తీయడంలో విఫలమవడంతో ఇంగ్లాండ్ బ్యాట్ మెన్స్ తలో కొన్ని పరుగులు చేశారు. దీంతో ఇంగ్లాండ్ కు భారీ స్కోరు సాధ్యమయ్యింది.
మొదటి ఓవర్లోనే బెయిర్ స్టో వికెట్ కోల్పోయినప్పటికి మరో ఓపెనర్ రాయ్, రూట్ మరో వికెట్ పడకుండా జాగ్రత్తపడుతూ స్కోరు బోర్డును ముందుకు కదిలించారు. దీంతో వీరిద్దరు హాఫ్ సెంచరీలను నమోదుచేసుకోవడంతో పాటు జట్టు స్కోరును సెంచరీ దాటించారు. ఈ మ్యాచ్ లో మొదటగా ఇంగ్లాండుపై దక్షిణాఫ్రికా టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది








