
‘గ్రౌండ్‌లో కైఫ్ మెరుపు వేగంతో కదులుతూ ప్రత్యర్థికి కైఫ్ చుక్కలు చూపించేవాడు.
ఒక్క మాటలో చెప్పాలంటే భారత ఫీల్డింగ్‌లో కైఫ్ ఓ ట్రెండ్ సెట్టర్’ అని మాజీ ఆటగాడు వీవీఎస్ లక్ష్మణ్ సహచరుడు మహ్మద్ కైఫ్‌ను ఆకాశానికెత్తేశాడు.
భారత క్రికెట్‌లో ఫీల్డింగ్‌కు కొత్త అర్థం చెప్పిన ఆటగాడు మహ్మద్ కైఫ్ అని, అతడి అడుగుజాడల్లో ఇప్పుడు ఎందరో ఆటగాళ్లు నడుస్తున్నారని పేర్కొన్నాడు.
ఎందరో యువ ఆటగాళ్లకు అతడు ఆదర్శంగా నిలుస్తున్నాడని చెప్పుకొచ్చాడు.
ముందుకు డైవ్ చేస్తూ ఓ అసాధారణమైన క్యాచ్ అందుకుంటున్న కైఫ్ ఫోటోను ఇటీవల తన ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేసిన లక్ష్మణ్ ఈ విధంగా రాసుకొచ్చాడు.
‘క్రికెట్‌లో ఓ తరాన్ని ప్రభావితం చేసిన ఆటగాడు మహ్మద్ కైఫ్. ఆటగాళ్లు తమ మనసులోని భయాలను పక్కనపెట్టి స్వేచ్ఛగా ఆడేందుకు, తమ అత్యున్నత ప్రతిభను బయటపెట్టేందుకు కైఫ్ ఓ మార్గాన్ని చూపాడు.
ఇప్పటికీ యూపీలోని ఎందరో యువ ఆటగాళ్లకు కైఫ్ ఓ రోల్ మోడల్‌గా నిలుస్తున్నాడు’ అంటూ లక్ష్మణ్ కైఫ్‌ను ఆకాశానికెత్తేశాడు.








