26.2 C
Hyderabad
Wednesday, November 25, 2026
- Advertisement -
Home క్రికెట్ 2020 వరకు టీమిండియా బిజీ షెడ్యూల్…

2020 వరకు టీమిండియా బిజీ షెడ్యూల్…

India Cricket Match, Newsxpressonline
- Advertisement -

ఢిల్లీ: వరల్డ్ కప్‌లో భాగంగా నేడు టీమిండియా….దక్షిణాఫ్రికాతో తలపడనున్న విషయం తెలిసిందే. సౌథాంప్టన్ వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. అయితే వరల్డ్ కప్ తర్వాత…2020 మార్చి వరకు భారత్ సొంతగడ్డపై ఆడే మ్యాచుల షెడ్యూల్‌ని బీసీసీఐ తాజాగా విడుదల చేసింది.

ఈ సంవత్సరం సెప్టెంబర్ నుంచి 2020 మార్చి వరకూ టీమిండియా ఐదు టెస్ట్ మ్యాచ్ లు, 9 వన్డేలు, 12 టీ-20లను ఇండియాలో ఆడనుంది. వరల్డ్ కప్ తరువాత ఇండియాలో భారత మ్యాచ్ లు ఫ్రీడమ్ ట్రోఫీతో ప్రారంభమవుతాయి.
ఇండియా వర్సెస్‌ దక్షిణాఫ్రికా ఫ్రీడమ్‌ ట్రోఫీలో భాగంగా సెప్టెంబరు 15న మొదటి టీ-20 ధర్మశాలలో, 18న రెండో టీ-20 మొహాలీలో, సెప్టెంబరు 22న మూడో టీ- 20 బెంగళూరులో జరగనున్నాయి.

ఇక అక్టోబరు 2 నుంచి 6 వరకూ తొలి టెస్టు విశాఖపట్నంలో, 10 నుంచి 14 వరకూ రెండో టెస్ట్ రాంచీలో, 19 నుంచి 23 వరకూ మూడో టెస్ట్ పుణెలో జరగనున్నాయి.

ఆ తర్వాత నవంబర్ లో బంగ్లాదేశ్ పర్యటనకు రానుంది. నవంబరు 3న తొలి టీ-20 న్యూఢిల్లీలో, 7న రెండో టీ-20 రాజ్‌ కోట్‌ లో, 10న మూడో టీ-20 నాగపూర్‌ లో జరగనున్నాయి. ఆపై నవంబర్ 14 నుంచి 18 వరకూ తొలి టెస్ట్ ఇండోర్ లో, 22 నుంచి 26 వరకూ రెండో టెస్ట్ కోల్ కతాలో జరగనున్నాయి.

ఇక డిసెంబర్ లో వెస్టిండీస్ జట్టు ఇండియాలో పర్యటించనుంది. డిసెంబర్ 6న  తొలి టీ-20 ముంబైలో, 8న రెండో టీ-20 తిరువనంతపురంలో, 11న మూడో టీ-20 హైదరాబాద్ లో జరగనున్నాయి. అదే నెలలో 15న తొలి వన్డే చెన్నైలో, 18న రెండో వన్డే విశాఖపట్నంలో, 22న మూడో వన్డే కటక్ లో జరగనున్నాయి.

2020 షెడ్యూల్…

ఆ తర్వాత 2020 జనవరిలో జింబాబ్వే జట్టు పర్యటించనుండగా, 5న తొలి టీ-20 గౌహతీలో, 7న రెండో టీ-20 ఇండోర్ లో, 10న మూడో టీ-20 పుణెలో జరగనున్నాయి. అదే నెలలో ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ కూడా ఉంది. జనవరి 14న తొలి వన్డే ముంబైలో, 17న రెండో వన్డే రాజ్ కోట్ లో, 19న మూడో వన్డే బెంగళూరులో జరగనున్నాయి. ఇక మార్చిలో దక్షిణాఫ్రికా జట్టు రానుంది. మార్చి 12న తొలి వన్డే ధర్మశాలలో, 15న రెండో వన్డే లక్నోలో, 18న మూడో వన్డే కోల్ కతాలో జరుగుతాయి.

చదవండి: వరల్డ్ కప్‌లో కొత్త జెర్సీతో కనువిందు చేయనున్న టీమిండియా…
- Advertisement -