24.6 C
Hyderabad
Wednesday, November 4, 2026
- Advertisement -
Home క్రికెట్ ఐపీఎల్‌: మరో ఆసక్తికర పోరుకు రంగం సిద్ధం! సమవుజ్జీలులో గెలిచేదెవరు?

ఐపీఎల్‌: మరో ఆసక్తికర పోరుకు రంగం సిద్ధం! సమవుజ్జీలులో గెలిచేదెవరు?

IPL Latest News, Cricket Latest News, India Match News, Newsxpressonline
- Advertisement -

ఢిల్లీ: ఐపీఎల్‌లో మరో రెండు సమవుజ్జీలు పోరుకు సిద్ధమయ్యాయి. ఈ రెండు జట్లు పాయింట్ల పట్టికలో నాలుగేసి పాయింట్లతో ఉన్నాయి. సన్‌రైజర్స్‌ ఎప్పటిలాగే సీజన్‌ను ప్రారంభించగా దిల్లీ మాత్రం మునుపటికంటే బలంగా కనిపిస్తోంది.

కోల్‌కతాతో పాటు పంజాబ్‌ను ఓడించి మేము కూడా టైటిల్‌ రేసులో ఉన్నామని ఇప్పటికే హెచ్చరికలు పంపించింది. మరో వైపు హైదరాబాద్‌ మాత్రం రెండు మ్యాచుల్లో సునాయాసంగా విజయాలు సాధించింది. గత ఆదివారం రాయల్ ఛాలెంజర్స్‌ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో బెంగళూరును మట్టికరిపించిన హైదరాబాద్‌ ప్రమాదకర జట్టుగా ముద్ర వేసుకుంది.

సమవుజ్జీలుగా కనిపిస్తున్న ఈ రెండు జట్లు దిల్లీలోని ఫిరోజ్‌ షా కోట్లా మైదానం వేదికగా ఈ రోజు రాత్రి 8గంటలకు ప్రారంభం కానుంది.బెంగళూరుతో మ్యాచ్‌ సందర్భంగా వార్నర్‌ చేతికి గాయమైంది. మరో శతకధీరుడు బెయిర్‌ స్టో బ్యాటింగ్‌ సమయంలో కొంచెం ఇబ్బంది పడ్డట్లు కనిపించాడు. అయితే ఈ ఇద్దరూ మ్యాచ్‌కు పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉన్నట్లు జట్టు యాజమాన్యం తెలిపింది.

దిల్లీలోని ఫిరోజ్‌షా కోట్లా మైదానంలో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌కు మంచి రికార్డు ఉంది. ఈ వేదికలో నాలుగు సార్లు ఈ రెండు జట్లు తలపడగా మూడు సార్లు హైదరాబాద్‌దే పైచేయి అయింది. ఒక్కసారి మాత్రం దిల్లీ గెలిచింది. ఈ సీజన్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఇంతవరకూ ఒక్కసారి కూడా పవర్‌ప్లేలో వికెట్‌ కోల్పోలేదు.

జట్లు అంచనా..

సన్‌ రైజర్స్‌ హైదరాబాద్‌: భువనేశ్వర్‌కుమార్‌(కెప్టెన్‌), డేవిడ్‌ వార్నర్‌, జానీ బెయిర్‌స్టో(వికెట్‌ కీపర్‌), విజయ్‌శంకర్‌, యూసుఫ్‌ పఠాన్‌, మనీశ్‌పాండే, దీపక్‌ హుడా, మహమ్మద్‌ నబీ, రశీద్‌ఖాన్‌, సందీప్‌ శర్మ, సిద్ధార్థ్ కౌల్‌.

ఢిల్లీ క్యాపిటల్స్‌: శ్రేయస్‌ అయ్యర్‌(కెప్టెన్‌), పృథ్వీ షా, శిఖర్‌ ధావన్‌, రిషభ్‌పంత్‌(వికెట్‌ కీపర్‌), ఇన్‌గ్రామ్‌, క్రిస్‌ మోరిస్‌, హనుమ విహారి, అక్షర్‌ పటేల్‌, కగిసో రబాడ, అవేశ్‌ ఖాన్‌, సందీప్‌ లమిచ్చనే.

చదవండి: పోలార్డ్ స్టన్నింగ్ క్యాచ్! ముంబై అద్భుత విజయం!
- Advertisement -