23.7 C
Hyderabad
Tuesday, October 13, 2026
- Advertisement -
Home వార్తలు ఆంధ్రప్రదేశ్ ప్రజలపై నోట్లు విసిరిన వైసీపీ పార్టీ నేతలు: కేసు నమోదు

ప్రజలపై నోట్లు విసిరిన వైసీపీ పార్టీ నేతలు: కేసు నమోదు

- Advertisement -

కర్నూలు: ఎన్నికల ప్రచారం వేళ డబ్బులు వెదజల్లుతూ కొందరు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు ప్రదర్శించిన అత్యుత్సాహంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ నియోజకవర్గంలో వైసీపీ నుంచి గంగుల బ్రిజేంద్ర రెడ్డి ఎన్నికల బరిలో ఉన్నారు.

కాగా, ఆయన తరఫున శిరివెళ్లలో ప్రచారం చేస్తున్న కొందరు నేతలు ప్రజలపై డబ్బులు వెదజల్లారు. దీంతో నోట్లు ఏరుకునేందుకు స్థానికులు ఎగబడ్డారు. ఆలస్యంగా ఈ ఘటన వెలుగుచూసింది. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌ అవుతోంది.

వైసీపీ నేతలపై కేసు నమోదు

ఎన్నికల ప్రక్రియను అపహాస్యం చేసిన వైసీపీ నాయకులపై చర్యలు తీసుకోవాలని స్థానిక టీడీపీ నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో వైసీపీకు చెందిన అన్వర్‌ బాషా, సలీం అనే వ్యక్తులపై కేసు నమోదు చేశారు.

కాగా, రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల వాహనాల్లో డబ్బులు దొరుకుతున్న విషయం తెలిసిందే. ఎన్నికల వేళ ఓటర్లకు డబ్బులు పంచేందుకు ఆయా పార్టీలు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

చదవండి: ‘గంట’ మోగొద్దు!: జగన్ దోరణి ఇదేనంటూ పవన్ కళ్యాణ్ విమర్శలు

- Advertisement -