మండుటెండల్లో చల్లచల్లగా.. మార్కెట్లోకి రెండు కొత్త పానీయాలు!

heritage-brahmani-ragi-sabja-lassi
- Advertisement -

హైదరాబాద్‌: హెరిటేజ్‌ ఫుడ్స్‌ లిమిటెడ్ తన ఆరోగ్య పానీయాల విభాగంలో రెండు కొత్త ఉత్పత్తులను ప్రవేశపెట్టింది. మండుటెండల్లో చల్లచల్లగా తాగేందుకు రాగి లస్సీ, సబ్జా లస్సీలను మార్కెట్‌లోకి విడుదల చేసింది.

వీటి విడుదల సందర్భంగా సంస్థ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ నారా బ్రాహ్మణి మాట్లాడుతూ.. వినియోగదారుల అవసరాలను గుర్తించి, వారిని ఆకట్టుకునేందుకు ఈ వినూత్న ఉత్పత్తులను ప్రవేశ పెడుతున్నామని, ఈ కొత్త ఉత్పత్తులు వినియోగదారులను అమితంగా ఆకర్షిస్తాయని భావిస్తున్నామని చెప్పారు.

రాగి లస్సీ కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుందని, తద్వారా బరువు తగ్గడానికి తోడ్పడుతుందని, అలాగే సబ్జా లస్సీ జీర్ణక్రియను మెరుగు పరుస్తుందని ఆమె తెలిపారు. సందర్భాన్ని బట్టి, సరికొత్త పానీయాలను విడుదల చేయడంలో తమ సంస్థ ఎల్లప్పుడూ ముందే ఉంటుందని బ్రాహ్మిణి వ్యాఖ్యానించారు.

- Advertisement -