
- Advertisement -
ముంబై: 2018-19 ఆర్ధిక సంవత్సరం ముగింపు రోజు.. మార్చి 31.. ఆదివారం.. సెలవు రోజు.. అయినా కూడా దేశవ్యాప్తంగా బ్యాంకులు ఈ రోజున పనిచేయనున్నాయి. ఈ రోజున ప్రభుత్వ ఖాతాలు నిర్వహించే శాఖలు తెరిచే ఉంచాలని ఆర్‌బీఐ ఆదేశాలు జారీ చేసింది.
ప్రభుత్వ రసీదులు, చెల్లింపుల కార్యాలయాలు మార్చి 31వ తేదీన కూడా పనిచేయాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది. అలాగే ఈ ఆర్ధిక సంవత్సరానికి సంబంధించి ఏజెన్సీ బ్యాంకులు నిర్వహించే ప్రభుత్వ లావాదేవీలన్నీ కూడా ఈ ఆర్ధిక సంవత్సర ఖాతాల్లో ప్రతిబింబించేలా చూడాలని ఆదేశించింది.
ఈ నేపథ్యంలో.. ఏజెన్సీ బ్యాంకుల శాఖల్లోని కౌంటర్లు ఈ నెల 30వ తేదీ రాత్రి ఎనిమిది గంటల వరకు, 31వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు తెరిచి ఉంచాలని రిజర్వ్ బ్యాంక్ తన ఆదేశాల్లో పేర్కొంది.
- Advertisement -







