
గుంటూరు: ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై.. మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు బుధవారం మరోసారి ట్విట్టర్ వేదికగా విరుచుకుపడ్డారు.
రాష్ట్రంలో పాలన కోతలరాయుడి వ్యవహారంలా ఉందంటూ విమర్శించారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను జగన్ అధికారంలోకి వచ్చాక విస్మరించాడంటూ దుయ్యబట్టారు.
అన్ని ధరలూ పెంచేస్తూ ప్రజలపై లేనిపోని భారం మోపుతున్నాడని, ఈ కోతలరాయుడి ఏడాది పాలనకే రాష్ట్ర ప్రజలు బెంబేలు పడిపోతున్నారంటూ చంద్రబాబు విమర్శించారు.
‘‘వెనకటికి ఒక కోతలరాయుడు శుక్రవారం రోజున కొండను మోస్తానని జనాన్ని నమ్మించాడంట. నిజమే అనుకుని ఆ రోజు కొండ దగ్గరికి ప్రజలంతా వెళ్తే, కోతలరాయుడు వచ్చి.. ‘మీరంతా కొండను ఎత్తి నా భుజాలపై పెట్టండి. నేను మోస్తాను’ అన్నాడంట..’’ అంటూ జగన్ను ఎద్దేవా చేశారు.
‘‘ఏపీలో కోతలరాయుడి పాలన కూడా అలాగే ఉంది. ముద్దులు పెట్టి, ఏది కావాలంటే అది ఇస్తానంటూ ప్రజలను నమ్మించారు. తీరా అధికారంలోకి వచ్చాక, ఆదాయం కోసం జనాన్ని ధరల బరువు మోయమంటున్నారు. ఏడాది కాలంలోనే కోతలరాయుడి ధరాఘాతాలకు ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు..’’ అంటూ చంద్రబాబు విమర్శించారు.
‘‘పాలనకు, హామీల అమలుకు అవసరమైన సంపదను ప్రభుత్వం సృష్టించుకోవాలి. అంతేకానీ ధరలు పెంచేసి ప్రజలను పీడించడం ఏంటి? ఇదేం చేతకాని పాలన?’’ అంటూ చంద్రబాబు వరుస ట్వీట్ల ద్వారా ముఖ్యమంత్రి జగన్పై విమర్శలు కురిపించారు.
వెనకటికి ఒక కోతలరాయుడు శుక్రవారం రోజున కొండను మోస్తానని జనాన్ని నమ్మించాడంట. నిజమే అనుకుని ఆరోజు కొండ దగ్గరికి ప్రజలంతా వెళ్తే, కోతలరాయుడు వచ్చి… “మీరంతా కొండను ఎత్తి నా భుజాల మీద పెట్టండి. నేను మోస్తాను.” అన్నాడంట(1/3)#TwoFacedJagan#1YearOfMassDestruction pic.twitter.com/FdtvJ6AsXM
— N Chandrababu Naidu #StayHomeSaveLives (@ncbn) June 3, 2020
ఏపీలో కోతలరాయుని పాలన కూడా అలాగే ఉంది. ముద్దులు పెట్టి, ఏది కావాలంటే అది ఇస్తానని ప్రజలను నమ్మించారు. తీరా అధికారంలోకి వచ్చాక, ఆదాయం కోసం జనాన్ని ధరల బరువు మోయమంటున్నారు. ఏడాది కాలంలో కోతలరాయుని ధరాఘాతాలకు ప్రజలు బెంబేలెత్తి పోతున్నారు(2/3)#TwoFacedJagan#1YearOfMassDestruction
— N Chandrababu Naidu #StayHomeSaveLives (@ncbn) June 3, 2020
పాలనకు, హామీల అమలుకు అవసరమైన సంపదను ప్రభుత్వం సృష్టించుకోవాలి. అంతేకానీ ధరలు పెంచేసి ప్రజలను పీడించడం ఏంటి? ఇదేం చేతకాని పాలన?(3/3)#TwoFacedJagan#1YearOfMassDestruction
— N Chandrababu Naidu #StayHomeSaveLives (@ncbn) June 3, 2020
మాన్సాస్ ట్రస్ట్ వివాదంపైనా…
అంతకుముందు, మాన్సాస్ ట్రస్ట్ వివాదంపైనా చంద్రబాబు ట్వీట్ ద్వారా స్పందించారు.
మాన్సాస్ ట్రస్ట్ అన్నది ఒక ఉన్నతమైన లక్ష్యాలతో పూసపాటి వంశీయులు స్థాపించిన సంస్థ అని, ఆ సంస్థ కింద 105 దేవాలయాలతోపాటు ఎన్నో విద్యాలయాలు ఉన్నాయని పేర్కొన్నారు.
సంస్థకు ఉన్న పవిత్ర ఆశయాలను దృష్టలో ఉంచుకుని తెలుగుదేశం సహా ఏ పార్టీ అధికారంలో ఉన్నా దాని విషయాల్లో ఎన్నడూ జోక్యం చేసుకోలేదని ఆయన వ్యాఖ్యానించారు.
రూ.1.30 లక్షల కోట్లకుపైగా విలువజేసే ఆ ట్రస్ట్ భూములపై ఇప్పుడు కన్నేశారని, వాటిని కాజేయడానికి వైసీపీ పెద్దలు అధికారాన్ని సైతం దుర్వినియోగం చేస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు.
తన తండ్రి ఆశయాలను బతికించుకోవడానికి అశోక గజపతి రాజు తపన పడుతున్నారని, ఆయనకు అందరూ అండగా నిలవాలని, ఒక పవిత్ర సంకల్పాన్ని బతికించుకోవాలంటూ చంద్రబాబు ట్విట్టర్ ద్వారా పిలుపునిచ్చారు.
మాన్సాస్ ట్రస్ట్ అన్నది ఒక ఉన్నతమైన లక్ష్యాలతో పూసపాటి వంశీయులు స్థాపించిన సంస్థ. ఆ సంస్థ కింద 105 దేవాలయాలతో పాటు, ఎన్నో విద్యాలయాలు ఉన్నాయి. సంస్థకున్న పవిత్ర ఆశయాలను దృష్టిలో పెట్టుకుని తెలుగుదేశంతో సహా ఏ పార్టీ అధికారంలో ఉన్నా సంస్థ విషయాల్లో జోక్యం చేసుకోలేదు. (1/2) pic.twitter.com/BCLZ6lc3p3
— N Chandrababu Naidu #StayHomeSaveLives (@ncbn) June 3, 2020
అలాంటిది రూ.1 లక్షా 30 వేల కోట్లకు పైగా విలువజేసే ట్రస్ట్ భూముల మీద కన్నేసి, కాజేయడానికి వైసీపీ పెద్దలు అధికార దుర్వినియోగం చేస్తున్నారు. తండ్రి ఆశయాలను బతికించుకోవటానికి @Ashok_Gajapathi తపన పడుతున్నారు. ఆయనకు అందరూ అండగా నిలవాలి. ఒక పవిత్ర సంకల్పాన్ని బతికించాలి (2/2)
— N Chandrababu Naidu #StayHomeSaveLives (@ncbn) June 3, 2020








