26.4 C
Hyderabad
Sunday, September 20, 2026
- Advertisement -
Home వార్తలు ఆంధ్రప్రదేశ్ చంద్రబాబుకు తృటిలో తప్పిన ప్రమాదం….

చంద్రబాబుకు తృటిలో తప్పిన ప్రమాదం….

- Advertisement -

అమరావతి: టీడీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడుకు తృటిలో ఓ ప్రమాదం తప్పింది.  వాతావరణం సరిగా లేకపోవడంతో ఆయన ప్రయాణిస్తున్న విమానాన్ని అత్యవసరంగా దారి మళ్లించారు.

అమరావతి నుంచి నిన్న సాయంత్రం 7:20 గంటలకు కుమారుడు లోకేశ్‌తో కలిసి ఎయిరిండియా విమానంలో చంద్రబాబు హైదరాబాద్ బయలుదేరారు. అయితే, వాతావరణంలో ఒక్కసారిగా మార్పులు చోటుచేసుకుని ప్రతికూలంగా మారాయి.

దీంతో ఆ విమానాన్ని అత్యవసరంగా బెంగళూరుకు మళ్లించారు. రాత్రి 9:20 గంటలకు విమానం బెంగళూరు చేరుకుంది. ఇక వాతావరణం అనుకూలించడంతో తిరిగి రాత్రి 10:30 గంటలకు బెంగళూరు నుంచి బయలుదేరిన విమానం అర్ధరాత్రి దాటాక హైదరాబాద్ చేరుకుంది.

ఇక విమానంలో వీరితో పాటు మరో 130 మంది వరకు ప్రయాణికులు ఉన్నారు. అయితే ఎట్టకేలకు విమానం రాత్రి 1గంటకు హైదరాబాద్‌కి చేరుకోవడంతో ప్రయాణికులు అంతా ఊపిరి పీల్చుకున్నారు.

చదవండి: ఇక చంద్రబాబుకు రాజకీయ భవిష్యత్ లేదు: టీడీపీ నేత
- Advertisement -