26.2 C
Hyderabad
Thursday, November 26, 2026
- Advertisement -
Home వార్తలు ఆంధ్రప్రదేశ్ వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను: వైసీపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు

వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను: వైసీపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు

YCP MLA Latest News, YS Jagan News, AP Election News, Newsxpressonline
- Advertisement -

తిరుపతి: తిరుపతి వైసీపీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. నిన్న సాయంత్రం తిరుపతిలో జరిగిన నియోజకవర్గ వైసీపీ విస్తృతస్థాయి సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. తనకు మంత్రి పదవిపై ఆశ లేదని, రాబోయే ఎన్నికల్లో తాను పోటీ చేయబోనని ప్రకటించారు.

అయితే భూమన ఈ వ్యాఖ్యలు అనడానికి కారణం లేకపోలేదు. ఈరోజు విజయవాడలో వైసీపీ శాసనసభా పక్ష సమావేశం జరగనుంది. అందులో మంత్రివర్గం కూర్పుపై ప్రధానంగా చర్చ జరిగే అవకాశముంది. ఎవరికి అవకాశం కల్పిస్తున్నది జగన్‌ స్వయంగా ప్రకటించే అవకాశముంది.

ఈ నేపథ్యంలో నిన్న భూమన వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనని చెప్పారు. అంటే ఇప్పుడే ఏదొక మంత్రి పదవి ఇవ్వాలని పరోక్షంగా భూమన జగన్‌ని రిక్వెస్ట్ చేసినట్లు అర్ధమవుతుంది. అయితే చిత్తూరు జిల్లాలో నెలకొన్న ప్రత్యేక పరిస్థితుల కారణంగా ఒకే సామాజికవర్గం నుంచి ఎక్కువ మందికి మంత్రివర్గంలో అవకాశం కల్పించడం కష్టంగా మారినట్టు కనిపిస్తోంది.

రెడ్డి సామాజికవర్గంలో జిల్లా నుంచి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆర్‌కే రోజా, భూమన కరుణాకర్‌రెడ్డి మంత్రి పదవులు పొందడానికి అవకాశమున్నవారు. అయితే తాజా పరిణామాల మధ్య తొలి ప్రాధాన్యత కింద పెద్దిరెడ్డితో పాటు ఆ అవకాశం అందుకునేది ఎవరన్న చర్చ సాగుతోంది. మరి చూడాలి వీరిలో మంత్రి పదవి ఎవరికి దక్కుతుందో.

చదవండి: కడపజిల్లా ఎమ్మెల్యేకి క్యాబినెట్ లో చోటు! విజయవాడకు బయల్దేరిన ఎమ్మెల్యే
- Advertisement -