
హైదరాబాద్: ఏపీ ఎన్నికల్లో చంద్రబాబు నేతృత్వంలోని టీడీపీ ఓటమిపై నటి, టీడీపీ మహిళా నేత దివ్యవాణి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఓ టీవీ చానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ… ఓ పౌరుషం ఉన్న సింహాన్ని బంధించడానికి ఎన్ని ప్రయత్నాలు చేయాలో అన్నీ చేసారంటూ…చంద్రబాబు పరిస్థితికి తగిన విధంగా వివరించారు.
అయితే ఎన్నికల్లో టీడీపీని ఓడించాడనికి ప్రత్యర్థులు చేయని ప్రయత్నమంటూ లేదని, ఎన్నికల్లో టీడీపీకి ఇలాంటి ఫలితాలు రావడం పట్ల సామాన్య ప్రజలు సైతం ఆశ్చర్యపోతున్నారని ఆమె వ్యాఖ్యానించారు. ఇక ఎన్నికల ఫలితాలు వచ్చిన రోజు సాయంత్రం చంద్రబాబు గారిని కలిశానని, ఏంటన్నయ్యా ఇది అని పరామర్శించానని చెప్పారు.
కానీ ఆయన మాత్రం ధైర్యం కోల్పోకుండా…మన పని మనం చేసుకుంటూ వెళదాం అంటూ ఎంతో పరిణతితో మాట్లాడారని వెల్లడించారు. గెలుపోటములు సహజం అని పేర్కొన్నారు. ఈ ఎన్నికల్లో టీడీపీ ఓటమి ఈవీఎంల వల్లో, మరి దేని వల్ల వచ్చిందో తెలియదని అన్నారు. అయితే ఏదైనా పైన దేవుడు చూస్తూనే ఉంటాడని దివ్యవాణి తెలిపారు.








