సంచలనం: జగన్‌పై ప్రశంసల వర్షం కురిపించిన జేసీ…

APCM Jagan News, JC Diwakar Reddy News, AP Political News, Newsxpressonline
- Advertisement -

అనంతపురం: ఎప్పుడూ తనదైన శైలిలో వ్యాఖ్యలు చేస్తూ మీడియాలో నిలిచే టీడీపీ నేత జేసీ దివాకర్ రెడ్డి..మరోసారి వార్తల్లో నిలిచారు. అది కూడా తన ప్రత్యర్ధి పార్టీ అయిన వైసీపీ అధినేత, ఏపీ సీఎం జగన్‌పై ప్రశంసల జల్లు కురిపించారు.

సీఎం అయినందుకు జగన్ కు అభినందనలు తెలిపిన ఆయన…. గతంలో జగన్ పై రాజకీయపరమైన విమర్శలు చేశానే తప్ప ఏనాడూ ద్వేషించలేదని అన్నారు.  అయితే జగన్ ను ఓ విషయంలో మెచ్చుకోవాలని, ప్రత్యేక హోదా అంశంలో మొదటి నుంచి ఒకే పంథాకు కట్టుబడి ఉన్నాడని తెలిపారు.

అసలు ఈ విషయంలో తొలినుంచి జగన్ నిజాయతీగా వ్యవహరిస్తున్నాడని, అలాగే ఢిల్లీలో మోడీతో జగన్ మాట్లాడిన విధానం చూస్తే కచ్చితంగా ప్రత్యేక హోదా సాధిస్తాడనిపిస్తోందని చెప్పారు. ఇక ఢిల్లీలో జగన్ మాట్లాడిన తీరుతెన్నులు అద్భుతమని జేసీ పొగడ్తలతో ముంచెత్తారు.

చదవండి: కేబినెట్‌లో అన్నీ కులాలకి ప్రాతినిద్యం కల్పించనున్న జగన్….
- Advertisement -