
చెన్నై: తమిళ్ స్టార్ హీరో సూర్య తాజాగా నటించిన చిత్రం ఎన్జికే…పోలిటికల్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రంలో సాయి పల్లవి, రకుల్ ప్రీత్ సింగ్, జగపతిబాబు ప్రదనపాత్రల్లో నటించారు.
ఇక ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్‌గా నేడు రిలీజ్ అయింది. అయితే ఈ సినిమా విడుదల సందర్భంగా సూర్య అభిమానులు… ప్రపంచంలోనే అతి పెద్దదైన 215 అడుగుల సూర్య కటౌట్‌ని తమిళనాడు తిరుత్తణిలో ఏర్పాటు చేశారు. సుమారు 6 లక్షల వ్యయంతో సూర్య అభిమానులు దీన్ని పెట్టించారు.
అయితే 215 అడుగుల ఎత్తు ఉన్న ఈ కటౌట్ ని అనుమతి లేదని పైగా రోడ్డు పక్కనే ఉందనే కారణంతో అధికారులు సూర్య కటౌట్ ని తొలగించారు . ఇక ఇంత ఖర్చు పెట్టి భారీ కటౌట్‌ని ఏర్పాటు చేస్తే సినిమా రిలీజ్ రోజున తొలగించడం ఏంటి అని అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
అంతేకాదు తిరుత్తణి లో గలాటకు దిగారు కూడా . దీంతో పెద్ద ఎత్తున పోలీసులు రంగంలోకి దిగి సూర్య అభిమానులపై లాఠీ ఛార్జ్ చేయడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి .
ఇదిలా ఉంటే గతంలో కూడా విజయ్ నటించిన కత్తి సినిమాకి సంబంధించి అభిమానులు భారీ కటౌట్ ఏర్పాటు చేశారు. ఇక కటౌట్‌కి పాలాభిషేకం నిర్వహిస్తుండగా ప్రమాదవశాత్తు అభిమానులు కిందపడి గాయాలు పాలయ్యారు. అలాగే అజిత్ సినిమా విడుదల సందర్భంగా కూడా కటౌట్ కింద పడడంతో కొందరు ఫ్యాన్స్ గాయపడ్డారు.
ఈ నేపథ్యంలో అధికారులు భారీ కటౌట్లు పెట్టడానికి అనుమతి ఇవ్వడం లేదు, ఈ క్రమంలోనే సూర్య కటౌట్‌ని తొలగించారు.








