
ఢిల్లీ: ఎన్నో ఏళ్లుగా భారత్ క్రికెట్ జట్టుకి సేవలు అందించిన మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్..రాజకీయాల్లో కూడా ఖాతా తెరిచారు. రాజకీయ అరంగేట్ర ఎన్నికల్లోనే అదరగొట్టాడు. లోక్‌సభ ఎన్నికల్లో తూర్పు ఢిల్లీ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన గంభీర్.. తన సమీప కాంగ్రెస్ అభ్యర్థి అర్విందర్ సింగ్ లవ్లీపై 3,90,391 ఓట్ల మెజారిటీతో భారీ విజయం సాధించాడు.
గంభీర్ 55.35 ఓట్ షేర్‌తో మొత్తం 6,95,109 ఓట్లు సాధించాడు. అర్విందర్ సింగ్‌కు 3,04,718 ఓట్లు వచ్చాయి. ఇక ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన ఆతిశీ మెర్లీన్ 2,19,156 ఓట్లతో మూడో స్థానంలో నిలిచింది. గంభీర్ భారీ విజయం సాధించడంతో అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.
ఇక క్రికెటర్‌గా విజయవంతమైన గంభీర్.. పార్లమెంటేరియన్‌గా కూడా విజయవంతం అవ్వాలని సన్నిహితులు, అభిమానులు ఆకాంక్షించారు.
కాగా, గత ఏడాది డిసెంబర్లో అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్ బై చెప్పిన గంభీర్ సార్వత్రిక ఎన్నికలకు ముందు భారతీయ జనతా పార్టీలో చేరాడు. ఇక సార్వత్రిక ఎన్నికల్లో గంభీర్ బీజేపీ అభ్యర్ధిగా తూర్పు ఢిల్లీ నియోజకవర్గం నుంచి బరిలోకి ఘనవిజయం సాధించాడు.








