21.7 C
Hyderabad
Thursday, November 26, 2026
- Advertisement -
Home క్రికెట్ టీమిండియా క్రికెటర్లకి షాక్ ఇచ్చిన బీసీసీఐ! కొత్త నిబంధన ప్రకారం…

టీమిండియా క్రికెటర్లకి షాక్ ఇచ్చిన బీసీసీఐ! కొత్త నిబంధన ప్రకారం…

bcci
- Advertisement -

ఢిల్లీ: దాదాపు నెల రోజులకుపైగా కొనసాగుతూ, ప్రపంచ క్రికెట్ ప్రియులను అలరించేందుకు వరల్డ్ కప్ క్రికెట్ పోటీలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఆటగాళ్లకు బీసీసీఐ కొత్త నిబంధన విధించింది. క్రికెటర్లు తమ భార్యలను అయినా, ప్రియురాళ్లను అయినా, టోర్నీ ప్రారంభమైన 20 రోజుల తరువాతే అనుమతిస్తామని తేల్చి చెప్పింది.

ఫైనల్ వరకూ భారత్ చేరితే మొత్తం 35 రోజులకు పైగా లండన్‌లో జట్టు ఉంటుంది. అంటే, ఆటగాళ్ల భాగస్వాములు వారితో 15 రోజుల పాటు మాత్రమే కలిసుండే వీలుంటుంది. గతంలో వరల్డ్ కప్ పోటీల్లో రెండు వారాల తరువాత కుటుంబీకులను అనుమతించేవారు.

మే 31 నుంచి వరల్డ్ కప్ క్రికెట్…

ఇప్పుడు దాన్ని మరో ఐదు రోజులు పెంచారు. మే 22న భారత జట్టు ఇంగ్లండ్‌కు ప్రయాణించనుండగా, 31 నుంచి టోర్నీ ప్రారంభం అవుతుంది. ఈ 20 రోజులు గడిచేవరకు టోర్నీలో లీగ్ మ్యాచ్ లన్నీ పూర్తవుతాయి. భారత జట్టు నాకౌట్ దశకు వెళుతుందో లేదో కూడా స్పష్టమైపోతుంది.

చదవండి: ప్రపంచకప్ 2019: జట్లను ప్రకటించిన 8 దేశాలు… ఏ జట్టులో ఎవరెవరంటే..
- Advertisement -