27.8 C
Hyderabad
Sunday, October 11, 2026
- Advertisement -
Home వార్తలు ఆంధ్రప్రదేశ్ చంద్రబాబుకి బిగ్ షాక్! చేతులెత్తేసిన కర్నూల్ టీడీపీ నేతలు!

చంద్రబాబుకి బిగ్ షాక్! చేతులెత్తేసిన కర్నూల్ టీడీపీ నేతలు!

Chandrababu Latest News, AP Political News, AP Election Latest News, Newsxpressonline
- Advertisement -

కర్నూల్: ఏపీలో ఎన్నికలు ముగిసినా కూడా ఎన్నికల వేడి మాత్రం కొంత కూడా తగ్గడంలేదు. పోలింగ్ జరిగి పది రోజులు పూర్తికావొస్తున్నా కూడా పార్టీల అధినేతల దగ్గర నుండి కార్యకర్తల వరకు ఇతర పార్టీల నేతలపై పరస్పరం విమర్శలు చేస్తూనే ఉన్నారు.

అలాగే ఎవరికీ వారు వచ్చేది తమ ప్రభుత్వమే అని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ప్రజలు ఈ ఎన్నికలలో తమను ఆశీర్వదించారని వైసీపీ వారు చెప్తుంటే, తాము చేసిన అభివృద్దే మళ్ళీ తమకు అధికారాన్ని తెచ్చిపెడుతుందని టీడీపీ నేతలు బలంగా నమ్ముతున్నారు.

చదవండి: చంద్రబాబుని పరిగెత్తించి.. ఆ సమయం దగ్గర్లోనే ఉంది! వైసీపీ నేత హాట్ కామెంట్స్…

ఇకపోతే ఎన్నికలు ముగిసిన రోజు నుండి సీఎం చంద్రబాబు నాయుడు జిల్లాల వారీగా ఎన్నికలలో పోటీ చేసిన అభ్యర్థులతో భేటీలు నిర్వహిస్తూ వస్తున్నారు. తాజాగా శుక్రవారం కర్నూలు జిల్లాలో పోటీ చేసిన అభ్యర్థులందరితో కూడా చంద్రబాబు సమీక్ష నిర్వహించారు.

బాబు సమీక్ష సమావేశానికి ఏడుగురు అభ్యర్థుల గైర్హాజరు…

అయితే బాబుకు ఆయన పార్టీ అభ్యర్థులే షాక్ ఇచ్చారు.  ఈ సమీక్ష సమావేశానికి ఏడుగురు టీడీపీ అభ్యర్థులు గైర్హాజరు కావడం గమనార్హం.  సమావేశంలో కర్నూలు జిల్లా అభ్యర్థులతో చంద్రబాబు మాట్లాడుతూ..  మళ్లీ టీడీపీ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.

కర్నూలు జిల్లా ఓర్వకల్లు రాక్‌గార్డెన్‌లో చంద్రబాబు నాయుడు, టీడీపీ అభ్యర్థుల నడమ జరిగిన ఈ సమీక్ష సమావేశంలో జిల్లాలో ఎన్నికల పోలింగ్‌ సరళిపై ఆయా అభ్యర్థులను వివరాలు అడిగి తెలుసుకున్నారు బాబు.

అయితే ఈ సమావేశానికి కర్నూలు జిల్లాలో టీడీపీ తరపున పోటీ చేసిన అభ్యర్థులు అఖిల ప్రియ, బుడ్డా రాజేశేఖర్‌ రెడ్డి, కేఈ శ్యాంబాబు, టీజీ భరత్‌, తిక్కారెడ్డి, మీనాక్షి నాయుడు, కేఈ ప్రతాప్‌లు గైర్హాజయ్యారు. దీంతో చేసేది లేక సమావేశానికి వచ్చిన అభ్యర్థులనే అడిగా వివరాలు తెలుసుకున్నారు చంద్రబాబు.

అనంతరం ఆయన ఎయిర్‌ పోర్టు నుంచి హెలికాప్టర్‌లో ఎన్నికల ప్రచారం నిమిత్తం కర్ణాటకలోని రాయచూర్‌ జిల్లాకు బయలుదేరి వెళ్లిపోయారు.

చదవండి: ఏపీ సార్వత్రిక ఎన్నికల ఖర్చు ఎంతో తెలుసా?
- Advertisement -