- Advertisement -
హైదరాబాద్: ‘నా పేరు సూర్య’ తరువాత చాలా కాలం పాటు మరో సినిమాను ప్రకటించని అల్లు అర్జున్, ఇటీవలే త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ సినిమాను చేయాలని నిర్ణయించుకున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమా పూజా కార్యక్రమాలు కూడా జరిగిపోయాయి.
ఇక నేడు అల్లు అర్జున్ పుట్టినరోజు కాగా, నేడు మెగా అభిమానులకు డబుల్ బొనాంజా దక్కింది. ‘ఎంసీఏ’తో హిట్ కొట్టిన శ్రీరామ్ వేణు దర్శకత్వంలో, దిల్ రాజు నిర్మాతగా బన్నీ మరో చిత్రాన్ని చేయనున్నాడు. ఈ సినిమాకు ‘ఐకాన్ – కనబడుటలేదు’ అన్న ఆసక్తికర టైటిల్ ను పెట్టి,
టైటిల్ పోస్టర్ ను విడుదల చేశారు. దీంతో అధికారికంగా బన్నీ ఈ సంవత్సరం రెండు సినిమాలను ప్రకటించినట్టు. ఈ కొత్త టైటిల్ రివీల్ తో అల్లు అర్జున్ అభిమానులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.
- Advertisement -








