25.2 C
Hyderabad
Wednesday, November 4, 2026
- Advertisement -
Home సినిమా టాలీవుడ్ RRR లోకి ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్స్

RRR లోకి ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్స్

- Advertisement -

హైదరాబాద్: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , యంగ్ టైగర్ ఎన్టీఆర్ లు హీరోలుగా రాజమౌళి డైరెక్షన్లో తెరకెక్కుతున్న చిత్రం ఆర్ఆర్ఆర్. రామ్‌చరణ్‌కు జోడీగా బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్ నటిస్తుండగా , ఎన్టీఆర్ కు జోడిగా డైసీ ఎడ్గర్‌ జోన్స్‌ నటిస్తున్న సంగతి తెలిసిందే.

అలాగే అజయ్ దేవగణ్, సముద్రఖని ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. తాజాగా హైదరాబాద్ షెడ్యూలు పూర్తి చేసుకున్న చిత్ర యూనిట్..ఇప్పుడు నార్త్ ఇండియా షెడ్యూల్ కు సిద్ధం అవుతుంది.

ఈ షెడ్యూల్ లో చిత్ర హీరోయిన్స్ సెట్ లో జాయిన్ కాబోతున్నట్లు సమాచారం. దాదాపు 40 రోజుల పాటు ఈ షెడ్యూల్ సాగనుందని చిత్ర యూనిట్ చెపుతున్నారు. ఇక ఈ మూవీ లో రామ్‌చరణ్‌ అల్లూరి సీతారామరాజు పాత్ర చేస్తుండగా, ఎన్టీఆర్‌ కొమురం భీం పాత్రలో కనిపించనున్నారు.

2020 జులై 30 ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు నిర్మాత దానయ్య ప్రకటించారు. తెలుగు, హిందీ, తమిళం, మలయాళం భాషల్లో విడుదల చేయబోతున్నారు

- Advertisement -