23.5 C
Hyderabad
Wednesday, November 4, 2026
- Advertisement -
Home వార్తలు జాతీయం హీరోయిన్ త్రిషపై ద్వంద్వార్థ వ్యాఖ్యలు.. డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్ అరెస్ట్! తమిళనాడులో తీవ్ర ఉద్రిక్తత!

హీరోయిన్ త్రిషపై ద్వంద్వార్థ వ్యాఖ్యలు.. డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్ అరెస్ట్! తమిళనాడులో తీవ్ర ఉద్రిక్తత!

- Advertisement -

చెన్నై: తమిళనాడు రాజకీయాల్లో నటి త్రిషను ఉద్దేశించి డీఎంకే నేత‌ ఉద‌య‌నిధి స్టాలిన్‌ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు తీవ్ర కలకలం రేపాయి.

ముఖ్యమంత్రి విజయ్ నేతృత్వంలోని టీవీకే (TVK) ప్రభుత్వంపై నిరసన తెలుపుతున్న సమయంలో, నటి త్రిషను ఉద్దేశించి అసభ్యకర రీతిలో ద్వంద్వార్థ (డబుల్ మీనింగ్) వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలతో ప్రతిపక్ష నేత, డీఎంకే (DMK) వర్కింగ్ ప్రెసిడెంట్ ఉదయనిధి స్టాలిన్‌ను తమిళనాడు పోలీసులు మంగళవారం ఉదయం అరెస్ట్ చేశారు.

చెన్నైలోని నీలాంకరైలో ఉన్న ఆయన నివాసం నుంచి తంజావూరు పోలీసులు ఉదయనిధిని అదుపులోకి తీసుకుని వాహనంలో తరలించారు.

ఈ సందర్భంగా ఆయన నివాసం వెలుపల డీఎంకే కార్యకర్తలు భారీగా మోహరించి నిరసన తెలపడంతో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

వివాదం ఎలా మొదలైంది?
కావేరీ జలాల వివాదంపై తంజావూరులో డీఎంకే నిర్వహించిన రైతు ధర్నాలో ఉదయనిధి ప్రసంగించారు. సీఎం విజయ్ ప్రభుత్వంపై ఆయన విమర్శలు గుప్పిస్తున్న సమయంలో సభలోని కొందరు డీఎంకే కార్యకర్తలు “త్రిష.. త్రిష..” అంటూ నినాదాలు చేశారు.

దీంతో ప్రసంగాన్ని కాసేపు ఆపిన ఉదయనిధి, నీటి సరఫరాను త్రిష పేరుతో ముడిపెడుతూ ద్వంద్వార్థంలో వ్యాఖ్యలు చేశారని ఆరోపణలు వచ్చాయి. తాను కావేరి నది గురించే మాట్లాడానని ఆయన వెంటనే సర్దిచెప్పుకున్నప్పటికీ, ఆ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయి తీవ్ర దుమారం రేపింది.

9 సెక్షన్ల కింద కేసు.. ఎన్సీడబ్ల్యూకి ఫిర్యాదు!
ఉదయనిధి వ్యాఖ్యలపై టీవీకే (TVK) మహిళా విభాగం తంజావూరు ఈస్ట్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. దీంతో మహిళల పట్ల అపరాధ వ్యాఖ్యలు చేయడం (Section 79 BNS), హింసను ప్రేరేపించడం, ఐటీ యాక్ట్, త‌మిళనాడు మహిళల వేధింపుల నిరోధక చట్టంతో సహా మొత్తం 9 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు.

అంతేకాకుండా జాతీయ మహిళా కమిషన్ (NCW)కు కూడా టీవీకే ఫిర్యాదు చేసింది. బీజేపీ నాయకురాలు ఖుష్బూ సుందర్, ఇతర రాజకీయ పక్షాలు ఉదయనిధి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించాయి.

“ఇదొక పెద్ద కామెడీ.. చట్టపరంగా ఎదుర్కొంటా” – ఉదయనిధి
పోలీసు వాహనంలో తరలిస్తుండగా ఉదయనిధి మీడియాతో మాట్లాడుతూ.. “ఈ అరెస్టును నేను ఒక కామెడీలా చూస్తున్నాను. ఎడిట్ చేసిన నకిలీ వీడియాల (Cut, Copy, Paste) ఆధారంగా నాపై కేసులు పెట్టారు. నాపై ఎలాంటి బెదిరింపు చర్యలు పనిచేయవు, దీనిపై న్యాయపోరాటం చేస్తాను” అని పేర్కొన్నారు.

మరోవైపు ఉదయనిధి అరెస్ట్‌ను నిరసిస్తూ ఆయన న్యాయవాదులు మద్రాస్ హైకోర్టులో అత్యవసర ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు.

చదవండి: డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్‌పై సింగర్ చిన్మయి ఫైర్

- Advertisement -