24.6 C
Hyderabad
Tuesday, November 3, 2026
- Advertisement -
Home వార్తలు ఆంధ్రప్రదేశ్ పులివెందులలో జగన్ ప్రజాదర్బార్‌! ఫలితాల ముందు పులివెందుల పర్యటన వెనుక కారణం ఇదేనా?

పులివెందులలో జగన్ ప్రజాదర్బార్‌! ఫలితాల ముందు పులివెందుల పర్యటన వెనుక కారణం ఇదేనా?

YS Jagan Updates, Chandrababu Naidu Varthalu, AP Latest Political News, Newsxpressonline
- Advertisement -

అమరావతి: ఏపీలో ఎన్నికలు ముగిసిన తరువాత ఫలితాలపై అంచనాలు వేసుకోవడంలో మునిగిపోయిన ప్రధాన పార్టీల అధ్యక్షులు ఫలితాలపై ఓ అంచనాకు వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే ఏపీలోని లోక్ సభ నియోజకవర్గాల వారీగా టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సమీక్షలు నిర్వహిస్తుండగా.,వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా అభ్యర్థులతో సమావేశం నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు.

అంతకుముందే తన సొంత నియోజకవర్గమైన పులివెందులలో ప్రజాదర్బార్ కార్యక్రమంలో పాల్గొనాలని నిర్ణయించుకున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి,మూడు రోజుల పాటు కడప జిల్లాలోనే ఉండనున్నారు. మూడు రోజుల పర్యటనలో భాగంగా మంగళవారం పులివెందులకు వెళ్లనున్న జగన్, బుధవారం వైసీపీ కార్యాలయంలో జరిగే ప్రజాదర్బార్‌ కార్యక్రమంలో పాల్గొంటారని తెలుస్తోంది. గురువారం కూడా ప్రజాదర్బార్‌ నిర్వహించి అదేరోజు సాయంత్రం హైదరాబాద్‌కు బయలుదేరతారు.

చదవండి:  ఏ1, ఏ2 లకి అందరూ అలానే కనబడతారు!టీడీపీ నేత సంచలన వ్యాఖ్యలు.!

అయితే ఫలితాలకు ముందు జగన్ పులివెందుల పర్యటన వెనుక అసలు కారణం వేరే ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. రాయలసీమ జిల్లాల్లో వైసీపీ పరిస్థితి ఏ రకంగా ఉందనే దానిపై తన పులివెందుల పర్యటనలో జగన్ సమీక్ష నిర్వహించనున్నారని తెలుస్తోంది. పులివెందులలో తనకు రాబోయే మెజార్టీతో పాటు రాయలసీమ జిల్లాల్లో వైసీపీ విజయావకాశాలపై జగన్ సమీక్ష చేపట్టనున్నారు.

రాయలసీమలోని కర్నూలు, కడప, అనంతపురం, చిత్తూరుతో పాటు నెల్లూరు, ప్రకాశం జిల్లాలపై వైసీపీ భారీ ఆశలు పెట్టుకుంది. కోస్తా జిల్లాలతో పోలిస్తే.తమకు ఎక్కువగా పట్టున్న ఈ ఆరు జిల్లాల్లో అత్యధిక సీట్లు వస్తాయని వైసీపీ భావిస్తోంది. పులివెందుల పర్యటనలో భాగంగా ఈ ఆరు జిల్లాల నాయకులతో జగన్ సమావేశమై క్షేత్రస్థాయి పరిస్థితులపై చర్చించనున్నారు.

ముందుగా పార్టీ నేతలతో సమావేశం నిర్వహించడం వల్ల వైసీపీ విజయావకాశాలు ఎలా ఉన్నాయనే దానిపై వాస్తవాలు తెలుస్తాయని జగన్ భావిస్తున్నట్టు సమాచారం. మొత్తానికి జగన్ పులివెందుల పర్యటన తరువాత ఆ ఆరు జిల్లాల్లో పార్టీ విజయావకాశాలపై ఓ స్పష్టత వచ్చే అవకాశం ఉందని పార్టీలో చర్చ తెలుస్తోంది.

చదవండి: ఎల్లెక్షన్స్ ఫైట్! కృష్ణా జిల్లా: రెండు నియోజకవర్గాలలో ఎగిరే జెండా ఎవరిదీ?
- Advertisement -