27.6 C
Hyderabad
Wednesday, November 4, 2026
- Advertisement -
Home వార్తలు ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు మళ్లీ అధికారంలోకి వస్తే ఏం చేస్తారో తెలుసా?: జగన్ తీవ్ర విమర్శలు

చంద్రబాబు మళ్లీ అధికారంలోకి వస్తే ఏం చేస్తారో తెలుసా?: జగన్ తీవ్ర విమర్శలు

- Advertisement -

కడప: ఐదేళ్ల పాలనలో పేదలను మోసం చేసిన సీఎం చంద్రబాబు నాయుడు మరోసారి రాష్ట్రాన్ని దోచుకునేందుకు వస్తున్నాడని.. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు. అబద్ధాలు, మోసాలు, అవినీతి తప్ప చంద్రబాబు ప్రభుత్వంలో ఇంకేమీ కనబడవని జగన్‌ విమర్శించారు.

చంద్రబాబు మళ్లీ అధికారంలోకి వస్తే..

శుక్రవారం కడప జిల్లా మైదుకూరు, చిత్తూరు జిల్లా నగరిలో వైఎస్ జగన్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా తమ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని ప్రజలను కోరారు. చంద్రబాబు ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో ఇప్పటికే 6 వేల ప్రభుత్వం పాఠశాలలను మూయించేశారని.. చంద్రబాబు మళ్లీ ముఖ్యమంత్రైతే ఏపీలో ప్రభుత్వ పాఠశాలలే ఉండవన్నారు.

ఈ స్కూళ్లను మూసివేని ‘నారాయణ’ స్కూళ్లను రాష్ట్రవ్యాప్తంగా తెరిపిస్తారని ధ్వజమెత్తారు. చంద్రబాబు పాలనలో కరెంటు చార్జీలు, పెట్రోల్ రేట్లు, బస్సు ఛార్జీలు విపరీతంగా పెరిగాయన్న జగన్‌.. మళ్లీ టీడీపీ అధికారంలోకి వస్తే వీర బాదుడే ఉంటుందని అన్నారు.

చంద్రబాబు అధికారంలోకి వచ్చాక చిత్తూరు, రేణిగుంట చక్కెర ఫ్యాక్టరీలు మూతపడడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారన్న జగన్‌.. ‘హెరిటేజ్’ కోసం చిత్తూరు డెయిరీని మూయించేశారని ఆరోపించారు. అసెంబ్లీలో గట్టిగా పోరాటం చేస్తున్నందునే స్థానిక ఎమ్మెల్యే రోజాను సస్పెండ్‌ చేశారని జగన్‌ అన్నారు.

చంద్రబాబు ఐదేళ్ల పాలనలో చేయని మోసం, ఆడని అబద్ధం లేదని ఎద్దేవా చేశారు. పాదయాత్రలో రాష్ట్రంలోని ప్రజలందరి కష్టాలు తెలుసుకున్నానని.. అధికారంలోకి వచ్చాక పేద ప్రజల బాధలను దూరం చేస్తానని జగన్ హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా మైదుకూరు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి రఘురామిరెడ్డిని, కడప ఎంపీ అభ్యర్థి వైఎస్ అవినాష్ రెడ్డిలను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఓటర్లకు జగన్ పిలుపునిచ్చారు.

చదవండి: మాజీ మంత్రి హరీష్ కు తప్పిన పెనుప్రమాదం!

- Advertisement -