అప్పుడు, ఇప్పుడు 23 మందే..: చంద్రబాబుపై వైఎస్ జగన్ సూపర్ పంచ్!

12:53 pm, Sat, 25 May 19
YS Jagan Latest News, AP Political News, Chandrababu Naidu News, Newsxpressonline

అమరావతి: వైసీపీ నుంచి గెలిచిన 150 మంది ఎమ్మెల్యేలు…తమ శాసనసభాపక్ష నేతగా వైఎస్ జగన్‌ని ఈరోజు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. తాడేపల్లిలోని జగన్ నివాసంలో సమావేశమైన ఎమ్మెల్యేలు ఏకవాక్య తీర్మానంతో జగన్‌ని వైసీపీ ఎల్పీ నేతగా ఎన్నిక చేశారు.

ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ… ఈ విజయానికి కారణం తనతో పాటు కష్టపడ్డ నేతలు, నాయకులు, కార్యకర్తలు అని అన్నారు. ఇక మొన్న చంద్రబాబు ప్రభుత్వం అక్రమంగా తమ పార్టీ ఎమ్మెల్యేలు 23 మందిని కొనుగోలు చేసిందని,  ఈ ఎన్నికల్లో చంద్రబాబు సహా ఆ పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేల సంఖ్య కూడా 23 అని అదిరిపోయే పంచ్ వేశారు.

అలాగే ఎన్నికల ఫలితాలు వెలువడిన తేదీ 23 అని జగన్ చెప్పుకొచ్చారు. అక్రమాలు చేస్తే దేవుడు ఏ రకంగా మొట్టికాయలు వేస్తాడో చెప్పడానికి నిదర్శనం చంద్రబాబేనని, దేవుడు అంత గొప్పగా స్క్రిప్ట్ రాశాడని అన్నారు.

రాబోయే రోజుల్లో రాష్ట్ర రాజకీయాల్లో ఎప్పుడూ ఎవరూ చూడని విధంగా ప్రక్షాళన చేస్తానని, ఇందుకు, పార్టీ నాయకులందరూ సహకరించాలని కోరారు. ప్రజలు మనకు గొప్ప బాధ్యత అప్పగించారని, వారి విశ్వాసాన్ని నిలబెట్టుకోవాలని అన్నారు. జగన్ మంచి ముఖ్యమంత్రి’ అని అనిపించుకుంటానని, మంచి చేసేందుకు దేవుడు తనకు మనసు, జ్ఞానం ఇవ్వాలని కోరారు.

చదవండి: వైసీపీ రికార్డు: అతి చిన్న వయసులో ఎంపీ అయిన మాధవి…