22.7 C
Hyderabad
Wednesday, November 4, 2026
- Advertisement -
Home వార్తలు ఆంధ్రప్రదేశ్ జగన్‌ అధ్యక్షతన ప్రారంభమైన పార్లమెంటరీ సమావేసం .

జగన్‌ అధ్యక్షతన ప్రారంభమైన పార్లమెంటరీ సమావేసం .

- Advertisement -

 న్యూఢిల్లీ : ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన వైఎస్సార్ సీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం ఈ రోజు ( శనివారం) ఏపీ భవన్‌లో ప్రారంభమైంది. ఈ నెల 17 నుంచి ప‍్రారంభం కానున్న పార్లమెంట్‌ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై పార్టీ లోక్‌సభ, రాజ్యసభ సభ్యులకు జగన్‌ దిశానిర్దేశం చేయనున్నారు.

అలాగే ప్రత్యేక హోదాపై ఉభయసభల్లో అవలంభించాల్సిన విధానంపై పార్టీ నేతలకు పలు సూచనలు చేయనున్నారు. ఆ తరువాత మధ్యాహ్నం ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగే నీతి ఆయోగ్‌ సమావేశంలో సీఎస్‌ ఎల్వీ సుబ్రహ్మణ్యంతో కలిసి ఆయన పాల్గొంటారు.

ఈ సమావేశంలో 115 ఏస్పిరేషనల్‌ జిల్లాలపై చర్చ జరగనుంది. నీటి ఎద్దడి, తాగునీటి సమస్య నివారణ వంటి అంశాలపై విస్తృతంగా చర్చ జరగనుంది. అలాగే ఇప్పటికే కేంద్ర హోమ్ మినిష్టర్ షా తో భేటీ అయ్యాడు.

- Advertisement -