
అమరావతి : ఏపీ ప్రభుత్వాన్ని విశ్వాసానికి చిరునామాగా మారుస్తామన్నారు సీఎం వైస్ జగన్మోహన్ రెడ్డి. శాసనసభ స్పీకర్ గా తమ్మినేని సీతారం ఏకగ్రీవ ఎన్నిక అనంతరం… సీఎం హోదాలో తొలి ప్రసంగం చేశారు. ఈ సందర్భంగా నూతన సభాపతిని అభినందించారు.
చదవండి: హార్దిక్ నా కన్న గొప్ప క్రికెటర్ గా ఎదగాలి : కపిల్ దేవ్
రాష్ట్ర విభజన తర్వాత ఏపీ సభలో ఏర్పడిన పరిస్థితులపై అసంతృప్తి వ్యక్తం చేశారు జగన్. వైసీపీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలను టీడీపీ అక్రమంగా తమ పార్టీలో చేర్చుకుందన్నారు. అంతే కాక నలుగురికి మంత్రి పదవులు కూడా కట్టబెట్టిందన్నారు.
కానీ… తాము అలాంటి నీతిమాలిన రాజకీయాలు చేయబోమని… అలాంటి దుర్మార్గపు సాంప్రదాయాన్ని కొనసాగించబోమన్నారు. టీడీపీ ఎమ్మెల్యేలు వైసీపీలోకి రావాలనుకుంటే.. ఆ పార్టీకి రాజీనామా చేశాకే అనుమతిస్తామని స్పష్టం చేశారు.
ఒక స్పీకర్ ఎలా ఉండకూడదో గత శాసన సభ నిరూపించదని… కానీ మేము బ్యూటీ ఆఫ్ డెమొక్రసీ అంటే ఏంటో చూపిస్తామన్నారు జగన్. ప్రభుత్వ యంత్రాంగంలోని అన్ని శాఖల్లో అవినీతిని తొలగించి… విశ్వసనీయతకు కేరాఫ్ అడ్రస్ గా మారుస్తామన్నారు. ఆ దిశగానే తమ ప్రభుత్వం పని చేస్తుందని తెలిపారు.
చదవండి: మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్లకు కీలక పదవి!








