22.7 C
Hyderabad
Saturday, November 7, 2026
- Advertisement -
Home వార్తలు ఆంధ్రప్రదేశ్ తండ్రి మరణంతో కుప్పకూలిపోయిన వైసీపీ కీలకనేత!

తండ్రి మరణంతో కుప్పకూలిపోయిన వైసీపీ కీలకనేత!

Buchepalli Sivaprasad Reddy Latest News, YCP Leader Latest Updates, Newsxpressonline
- Advertisement -

ఒంగోలు: ప్రకాశం జిల్లాకు చెందిన వైసీపీ కీలకనేత బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి ఇంట తీవ్ర విషాదం నెలకొంది. శివప్రసాద్ తండ్రి, దర్శి మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి సుబ్బారెడ్డి కొద్దిసేపటి క్రితం అనారోగ్యంతో మృతి చెందారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న సుబ్బారెడ్డి హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.

సుబ్బారెడ్డి మరణంతో అయన కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. రేపు స్వగ్రామంలో సుబ్బారెడ్డి అంత్యక్రియలు జరుగుతాయని సమాచారం. అయన అంతిమ సంస్కారాలకు జిల్లాకు చెందిన వైసీపీ నేతలతో పాటు పలువురు నేతలు హాజరుకానున్నట్లు సమాచారం.సుబ్బారెడ్డి మరణించినట్లు సమాచారం అందుకున్న పలువురు రాజకీయ ప్రముఖులు, వైసీపీ నేతలు సంతాపం తెలిపి, ఆయన కుటుంబీకులకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు

Buchepalli Sivaprasad Reddy Latest News, YCP Leader Latest Updates, Newsxpressonline

ఇకపోతే సుబ్బారెడ్డి 2004లో దర్శి కాంగ్రెస్ టిక్కెట్ ఆశించారు. కానీ అధిష్టానం టికెట్ ఇవ్వడానికి నిరాకరించింది. దీంతో ఆయన స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసి ఆ ఎన్నికలలో ఘనవిజయం సాధించారు. ఆ తర్వాత కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు.

2009లో బూచేపల్లి కుమారుడు శివప్రసాద్ రెడ్డి దర్శి నుంచి కాంగ్రెస్‌ తరఫున ఎమ్మెల్యేగా పోటీచేసి గెలిచి వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. అయితే 2014లో వైసీపీ నుంచి పోటీచేసిన శివప్రసాద్ రెడ్డి అనూహ్య రీతిలో ఓటమి చెందారు. సుబ్బారెడ్డి మృతి తో దర్శిలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

చదవండి:  ఏపీ రాజకీయాలలో అసలు ట్విస్ట్ ఇదే! కోడలి నాని అనూహ్య నిర్ణయం!
- Advertisement -